అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన వారికి తిరిగి అవే కష్టాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే యాత్రకు బ్రేక్ ల మీద బ్రేక్ లు పడుతున్నాయి.
జమ్మూ: అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన వారికి తిరిగి అవే కష్టాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే యాత్రకు బ్రేక్ ల మీద బ్రేక్ లు పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా యాత్రను నిలిపివేస్తున్నట్లు యాత్ర నిర్వాహక అధికారులు చెప్పారు. ’ జమ్మూనగరంలోని భగవతి నగర్ వద్ద నుంచి ఎవ్వరినీ అమర్ నాథ్ యాత్రకు అనుమతించడంలేదు.
శాంతిభద్రతల పరిస్థితులు మెరుగవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఓ సీనియర్ అధికారి చెప్పాడు. ప్రస్తుతం కూడా జమ్మూకశ్మీర్ లో కర్ఫ్యూ పరిస్థితి కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు కూడా అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని సురక్షితంగా పటిష్ట భద్రత మధ్య బాల్ తాల్ బేస్ క్యాంపు నుంచి జమ్మూకు తరలించారు. మధ్యాహ్నం వారు ఢిల్లీకి బయలుదేరుతారు.