బీసీ రుణాలకు బ్రేక్ | BC Loans to break | Sakshi
Sakshi News home page

బీసీ రుణాలకు బ్రేక్

Published Sat, Jun 13 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

BC Loans to break

మంజూరు దశలో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలకు బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ రుణాలను ఉన్నపళంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రొసీడింగ్స్ సైతం తీసుకొని, డబ్బుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులు సర్కారు ఇచ్చిన షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. నిధుల్లో కోత విధించడంతో పాటు యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దీంతో లబ్దిదారులను ఎలా కుదిస్తారనే విషయంపై అయోమయం నెలకొంది. పాత లబ్దిదారులకు రుణాలు వస్తాయా? లేక కొత్తగా ఎంపిక చేపడుతారా? మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ఎంపిక చేస్తారా? అనే ప్రశ్నలకు మార్గదర్శకాలు రావాల్సి ఉంది.                 
 
 కరీంనగర్ సిటీ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణం గా నిధులు విడుదల చేసి జిల్లాల వారీగా యూనిట్ల లక్ష్యాలను నిర్దేశించింది. యూనిట్లకు అనుగుణంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ల గడువు గత నెలలోనే ముగిసింది. జిల్లావ్యాప్తంగా బ్యాంకర్లు, ఎంపీడీఓలు కలిసి లబ్దిదారులను ఎంపిక చేశారు. చాలా మంది లబ్దిదారులు రుణ మంజూరీకి సంబంధించి ప్రొసీడింగ్స్ సైతం అందుకున్నారు. ఈ దశలో రుణాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
 
 1783కు తగ్గిన యూనిట్లు
 బీసీ కార్పొరేషన్ రుణాలకు కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం భారీగా కోత విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌ను రూ.115 కోట్ల నుంచి రూ.30 కోట్లకు కుదించినట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే ఆయా జిల్లాలకు కేటాయించిన యూనిట్లలోనూ కోత పడింది. జిల్లాకు సంబంధించి గతంలో అర్బన్, రూరల్ కేటగిరీల్లో 5922 యూనిట్లు కేటాయించారు. రూరల్‌లో 4335లక్ష్యం కాగా 3050, అర్బన్‌లో 1587 లక్ష్యానికి 1053, మొత్తంగా 5922 యూనిట్లకు 4103 దరఖాస్తులు వచ్చాయి. అరుుతే జిల్లాకు కేటారుుంచి న 5922 యూనిట్ల నుంచి 1783 యూనిట్లకు కుదిం చారు. దీంతో ఇప్పటికే ఎంపిక చేసిన లబ్దిదారులను యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా ఎలా కుదించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 ఆందోళనల్లో లబ్దిదారులు
 ‘రూ.2లక్షల రుణం మంజూరైంది. ఆ డబ్బుతో యూనిట్ పెట్టుకొని ఉపాధి పొందొచ్చని సంబరపడ్డ. మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ చేతికంది గంటలు కూడా గడవకముందే రుణాలు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదు. నోటి కాడి బుక్కను సర్కారు లాక్కున్నట్లయింది’ అంటూ కరీంనగర్ రాంనగర్‌కు చెందిన మల్లేశం అనే లబ్దిదారుడు వాపోయాడు. బ్యాంకర్ల నుంచి కాన్సెంట్ తీసుకొని, అధికారులు చుట్టూ తిరిగి, నానా కష్టాలు పడి రుణాలకు ఎంపికైతే చివరిక్షణంలో షాక్ ఇవ్వడాన్ని లబ్దిదారులు తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ రుణాలు వస్తాయో రావో కూడా అధికారులు చెప్పలేకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు.
 
 నిధుల్లో కోత వద్దు
 ఏ శాఖలోనూ లేనివిధంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన నిధుల్లో కోత విధించడం పట్ల బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొసీడింగ్స్ దశలో రుణాలు నిలిపివేయడంపై మండిపడుతున్నాయి.  ప్రస్తుతం ఉన్న బీసీ బడ్జెట్ సరిపోవడం లేదని, మరింత పెంచాలని డిమాండ్ చేస్తుంటే, ఉన్న నిధుల్లో కోత విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారుు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నా, బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన యూనిట్లను మాత్రమే కుదించడం పట్ల బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. నిధుల్లో కోత లేకుండా, యూనిట్లను కుదించకుండా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement