సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప‍్రవేశించింది. రాష్ట్రంలో తొలిరోజు 4 కిలోమీటర్ల పాదయాత్రతో ముగించారు రాహుల్ గాంధీ. ఈనెల 26వ తేదీ వరకు జోడో యాత్రకు విరామం ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఢిల్లీకి పయణమయ్యారు రాహుల్. ఈనెల 27న రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు రాహుల్ గాంధీ. దేశ సమైక్యత కోసమే భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు పునరుద్ఘాటించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ యత్నిస్తున్నాయని ఆరోపించారు. దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు దేరివెళ్లినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 26న ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి మక్తల్ చేరుకుంటారు. ఈ నెల 27 నుండి రాహుల్ గాంధీ పాదయాత్రను పున: ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..
Comments
Please login to add a commentAdd a comment