పడవ ప్రయాణానికి బ్రేకులు
Published Wed, Aug 10 2016 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల్లో భాగంగా సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి పడప ప్రయాణానికి బ్రేక్ పడినట్లు సమాచారం. భద్రతా కారాణాలతో ఇప్పటికే శ్రీశైలంలో రోప్‌వే, బోటింగ్‌ను నిలుపుదల చేశారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి బోటింగ్ సదుపాయం లేకపోవడం, శ్రీశైలంలో రోప్‌వే, బోటింగ్ సదుపాయం బంద్ కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి ఆశాజనకంగా నీరు రావడంతో సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి రెండు మర పడవలను నడుపుతున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఇందు కోసం 50 సీట్ల సామర్థ్యం ఉన్న రెండు పడవలను కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు పర్యాటక సంస్థ అధికారులు రాజమండ్రి నుంచి 10 సీట్ల సామర్థ్యం ఉన్న పడవను తెప్పించి సిద్ధం చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పడవ ప్రయాణానికి బ్రేకులు వేసినట్లు పర్యాటక శాఖ అధికారలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సంగమేశ్వరంలో పుడ్ కోర్టు పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికి సా..గుతూనే ఉన్నాయి.
Advertisement
Advertisement