చిత్రాడలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం | ambedkhar statue break | Sakshi
Sakshi News home page

చిత్రాడలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

Published Fri, Dec 2 2016 12:14 AM | Last Updated on Fri, Aug 17 2018 8:12 PM

చిత్రాడ ఎస్సీ కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గురువారం దళిత సంఘ నేతలు ఆందోళనకు దిగారు.నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పిఠాపురం–కాకినాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో

పిఠాపురం రూరల్‌ : 
చిత్రాడ ఎస్సీ కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గురువారం దళిత సంఘ నేతలు ఆందోళనకు దిగారు.నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ పిఠాపురం–కాకినాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వారితో సీఐ ఉమర్, ఎస్‌.ఐ. కోటేశ్వరరావు చర్చించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకుంటే దళితులకు మద్దతుగా ఆందోళనకు దిగుతానని దొరబాబు హెచ్చరించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు. చిత్రాడ అంబేడ్కర్‌ యువజన సంఘ సభ్యుల ఫిర్యాదు మేరకు పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మాలమహానాడు సంఘ నేతలు ఆర్‌ఎస్‌ దయాకర్, దానం లాజర్‌బాబు, వర్థనపు కృష్ణవంశీ, దారా వెంకట్రావు, ఉలవల భూషణం, బోను దేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గండేపల్లి బాబీ, సంయుక్త కార్యదర్శి కర్రి ప్రసాద్,  నేతలు బొజ్జా రామయ్య, బత్తిన ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement