Y Break At Office Chair Potentially Help Millions Of Employees - Sakshi
Sakshi News home page

Y-Break at Office: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్‌!ఏంటంటే ఇది!

Published Mon, Jul 31 2023 1:12 PM | Last Updated on Mon, Jul 31 2023 2:12 PM

Y Break At Office Chair Potentially Help Millions Of Employees  - Sakshi

కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు టీ బ్రేక్‌, లంచ్‌ బ్రేక్‌, డిన్నర్‌ బ్రేక్‌లు ఉంటాయి. అది కామన్‌గా అన్ని ఆఫీసుల్లోనూ ఉంటుంది. అందరికీ తెలిసిందే కూడా. కానీ ఇక నుంచి వాటి తోపాటు వై బ్రేక్‌ ఉంటుందట. ఆ..! ఏంటి ఇది అనుకోకండి. అంటే విరామ సమయాన్ని తగ్గించేందుకు ఇలా యజమాన్యం చేస్తుందా అని డౌట్‌ పడోద్దు. ఎందుకంటే? ఇది ఉద్యోగుల ఆరోగ్యం కోసమేనట. 

అసలేం జరిగిందంటే..భారతదేశంలో మిలియన్‌ మంది ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతున్నారని ఓ సర్వేలో తేలింది. కొందరూ ఉద్యోగాలు ఆఫీస్‌లో పనిభారాన్ని, మరోవైపు కుటుంబాన్ని లీడ్‌ చేయలేక వివిధ అనారోగ్య సమస్యలు భారినపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఇంతవరకు అధికారులు సర్వేలు చేయడం, ఆ తర్వాత వాటిని గాలికొదిలేయడమే చేశారు అందరూ. కానీ ఇప్పుడూ సీరియస్‌గా తీసుకుని అందుకోసం చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యాయి పలు సంస్థలు, ప్రభుత్వాలు. ఈ మేరకు గత నెలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజు ఆయుష మంత్రిత్వ శాఖ​ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

'వై-బ్రేక్ ఎట్ ఆఫీస్ చైర్' అనే సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఉద్యోగుల దినచర్యలో 'యోగా'ని భాగస్వామ్యం చేసి తద్వారా ఒత్తిడిని దూరం చేసి పని చేయగలిగే సామర్థ్యం పెంచుకునే ఓ సువర్ణావకాశాన్ని ఉద్యోగులు కల్పించేందుకు రెడీ అయ్యింది. అందులో భాగంగానే ఈ 'వై' బ్రేక్‌ని కార్యాలయాల్లోకి తీసుకురానుంది ఆయుష్‌ మంత్రిత్వ శాఖ. ఇక నుంచి మాములుగా తీసుకునే బ్రేక్‌లు మాదిరిగా దీన్ని తీసుకుంటూ.. కాస్త పని ఒత్తిడి దూరం చేసుకోవడమే గాక తమ ఏకాగ్రతను పెంచుకుని షార్ప్‌గా తయారవ్వతారని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ మేరకు హ్యుమన్‌ ఎడ్జ్‌ వ్యవస్థాపకుడు సీఈవో డాక్టర్‌ మార్కస్‌ రాన్నీ ఈ విధానాన్ని స్వాగతించారు. ఆయన ఈ విధానం వల్ల ఉద్యోగులు శారీరకంగానూ, మానసికంగానూ పిట్‌గా ఉండేదుకు దోహదపడుతుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా చేయగలుగుతుంది. అలాగే భావోద్వేగ ఒత్తడికి కారణమయ్యే అడ్రినల్‌ హార్మోన్ల విడుదలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ఇందులో చేసే '"బ్రీథింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌"లు కారణంగా.. లోతుగా ఆలోచించగల సామర్థ్యం అలవడుతుంది. అలాగే ఉద్యోగుల ధ్యాస వేరేవాటిపైకి పోకుండా ప్రస్తుత పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది యోగా.

తమ  సంస్థ ఉద్యోగుల ఆరోగ్యానికి, సమస్యలకు ప్రయారిటీ ఇస్తుంది. ఈ 'వై బ్రేక్‌'ని కార్యాలయాల్లోకి తీసుకురావడం వల్ల ఉద్యోగులు ఫిట్‌గా ఉండి పని బాగా చేస్తారు. లీవ్‌ పెట్టే వాళ్ల సంఖ్య తగ్గిపోయి, పని సామర్థ్యం ఎక్కువ అవుతుంది. తద్వారా సంస్థ మంచి లాభాలను ఆర్జించగలదని అన్నారు. అలాగే జర్నల్‌ ఆప్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌కి సంబంధించిన ఆరోగ్య నిపుణులు కూడా ఈ యోగా ఒత్తిడిని తగ్గించి శారీరకంగా, మానిసింగ్‌ స్ట్రాంగ్‌ చేయగలదన్నారు. తాము జరిపిన అధ్యయనాల్లో ఆ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. దీన్ని క్షేత్ర స్థాయిలో అన్ని కార్యాలయాల్లో వచ్చేలా చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని హుడ్జ్‌ వ్యవస్థాపకుడు మార్కస్‌ చెప్పడం గమనార్హం.  

(చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement