సీఐల బదిలీలు ఇప్పట్లో లేనట్టే! | c.i. transfers break | Sakshi
Sakshi News home page

సీఐల బదిలీలు ఇప్పట్లో లేనట్టే!

Published Fri, Dec 23 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

శాంతి, అంతర్గత భద్రత పరిరక్షణలో కీలకమైన పోలీస్‌ శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల (సీఐ)ల బదిలీలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 40 మంది సీఐలు ఉన్నారు. వీరిలో 18 మంది పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, మరో 22 మంది దాకా స్పెషల్‌ బ్రాంచి, ఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్, ఏఆర్‌ సీఐలుగా పనిచేస్తున్నారు. వీరిలో సగం మందికి పైగా రెండేళ్లకు పైబడి సంబంధిత సర్కిల్‌

  • సంవత్సరాంతం, సంక్రాంతి సంబరాలు, కోడిపందాల నేపథ్యంలో విరామం ∙
  • డిమాండ్‌ ఉన్న కీలక స్టేషన్లలో పోస్టింగులకు ముమ్మరంగా పైరవీలు
  • కాకినాడ క్రైం : 
    శాంతి, అంతర్గత భద్రత పరిరక్షణలో కీలకమైన పోలీస్‌ శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల (సీఐ)ల బదిలీలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 40 మంది సీఐలు ఉన్నారు. వీరిలో 18 మంది పోలీస్‌ సర్కిల్‌  ఇన్‌స్పెక్టర్లు, మరో 22 మంది దాకా స్పెషల్‌ బ్రాంచి, ఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్, ఏఆర్‌ సీఐలుగా పనిచేస్తున్నారు. వీరిలో సగం మందికి పైగా రెండేళ్లకు పైబడి సంబంధిత సర్కిల్‌ స్టేషన్లలో పనిచేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో డిసెంబర్‌ నెల్లో సీఐల బదిలీలు జరిగాయి. మరో వారం పదిరోజుల్లో బదిలీల సమయం దాటిపోవడంతో ఇప్పట్లో బదిలీలు జరిగే అవకాశం లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు అంటున్నారు. డిసెంబర్‌లో బదిలీలైతే పిల్లల చదువుకు ఆటంకమని భావించి ఈ ప్రక్రియకు ఏలూరు రేంజ్‌ డీఐజీ వాయిదాకు అంగీకరించినట్లు సమాచారం. నూతన సంవత్సరం, సంక్రాంతి రోజులు రానుండడంతో పండుగకు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు, జూదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాత వారిని బదిలీ చేసి కొత్తవారికి పోస్టింగ్‌లు ఇస్తే  వారికి అయోమయంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. 
    ఆశలపై నీళ్లు
    డిసెంబర్‌ నెల్లో బదిలీలు జరుగుతాయనే ఉద్దేశంతో కీలకమైన పోలీస్‌ స్టేషన్లలో పోస్టింగులు వేయించుకునేందుకు పలువురు సీఐలు ముమ్మర ప్రయత్నాలు చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు నిర్ణీత మార్గదర్శకాలకు లోబడి జరుగుతుంటాయి. పోలీస్‌ శాఖలో బదిలీలు అధికారుల పనితీరు, నేరపరిశోధన, లక్ష్యసాధన,ప్రవర్తన వంటి వాటిని ప్రామాణికంగా చేసుకుని ఉన్నతాధికారులు చేస్తూంటారు, దాంతో పాటూ ఇంటిలిజె¯Œ్స అందించే నివేదికలను బట్టి కూడా బదిలీలు జరుగుతూ ఉంటాయి. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఎన్నడూ లేని రీతిలో పోలీసు అధికారుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కీలక ప్రాధాన్యం ఏర్పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ సిఫారసు లేఖల కోసం ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని  పలువురు పేర్కొంటున్నారు. దాంతో ప్రతిభ, సామర్థ్యం ఉన్నా, ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖ కోరుకున్న స్టేషన్లలో పోస్టింగ్‌ సాధించుకోలేకపోతున్నామని వాపోతున్నట్లు తెలిసింది. సర్పవరం, కాకినాడ ఒకటో, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్లకు మంచి గిరాకీ ఉండడంతో ఇక్కడ పోస్టింగ్‌ కోసం నెలరోజులుగా పలువురు సీఐలు సిఫారసు లేఖల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పవరం ఎ¯ŒSహెచ్‌వో గా పనిచేస్తున్న సీఐ వీఆర్‌లోకి వెళ్లడంతో ఇక్కడ పోస్టు ఖాళీ ఏర్పడింది. దాంతో ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టు కోసం ముగ్గురు సీఐలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పోస్టింగ్‌ కోసం ఓ సీఐ ముందంజలో ఉన్నట్లు తెలిసింది. ఓ సీఐ ప్రత్యేక జీవో ద్వారా డీవో ఆర్డర్‌ తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పోలీస్‌ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన తర్వాత సదరు సీఐ సర్పవరం ఎస్‌హెచ్‌వోగా చేరతారనే ప్రచారం డిపార్టుమెంట్‌లో జోరుగా సాగుతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement