
విశాఖ జిల్లా వాసులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు(బుధవారం) విరామం ప్రకటించారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎర్రవరం జంక్షన్ వద్ద జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
విశాఖ జిల్లా వాసులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి గురువారం ఉదయం నుంచి పాదయాత్ర యధావిథిగా ప్రారంభమౌతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన ద్వారా తెలియజేశారు.