సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం మూడు వేల కిలో మీటర్లకు చేరుకుంది. పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి.. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దినచర్యలో ఏ ఒక్కరోజూ మార్పు లేదు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా.. ఉదయం మాత్రం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. గంట పాటు వ్యాయామం.. కాలకృత్యాలనంతరం ఆరున్నర.. ఏడు గంటల వరకు పత్రికా పఠనం. ఆ తర్వాత ముఖ్యులతో ఫోన్ సంభాషణ. అనంతరం ఉదయం ఏడు.. ఏడున్నర గంటలకు పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో భేటీ. ఆ తర్వాత ఆ రోజు సాగే పాదయాత్ర మార్గాన్ని, ఏ గంటకు ఎక్కడ ఉండాలన్నది అడిగి తెలుసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్రను ప్రారంభించడంలో ఆయనకు ఆయనే సాటి.
గ్లాసు జ్యూస్‌తోనే..
ఉదయం అల్పాహారం లేకుండా కేవలం గ్లాస్ జ్యూస్ తాగి జగన్ తన యాత్రను ప్రారంభిస్తారు. రాత్రి ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించినా.. ఉదయం ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికల్లా టెంట్ నుంచి బయటకొస్తారు. రోజూ తెల్లటి చొక్కా, క్రీమ్ కలర్ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ఇవే ఆయన ఆహార్యం. మధ్యాహ్నం ఆయన కేవలం కొన్ని పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పూట ఆహారాన్ని కేవలం ఒకటీ రెండు పుల్కాలు, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు కప్పు పాలు తాగుతారు. ఇప్పటి వరకూ ఇదే ఆయన దినచర్య. మితాహారం, అధిక వ్యాయామంతోనే ఆయన రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు.
చదవండి:
కావాలి జగన్.. రావాలి జగన్..
Comments
Please login to add a commentAdd a comment