Health Secret
-
శివాజీరావు 90.0
రామంతాపూర్: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని సోమరిపోతులైన యువకులను ఉద్దేశించి అన్నాడో మహా కవి. దానిని సవరించుకుంటూ కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అని శివాజీరావును చూస్తే అనిపిస్తుంది. 90 ఏళ్ల వయస్సులో మనకు తెలిసి చాలా మంది మంచానికే పరిమితమైపోతారు. అనేక అనారోగ్య సమస్యలో ఇబ్బందిపడుతుంటారు. కాని శివాజీరావును చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఎందుకంటే ఇప్పటికీ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, కళ్లు మసకబారడం వంటి సమస్యలేవీ ఆయన దరిదాపుల్లోకి రాలేకపోయాయి అంటే ఆశ్చర్యపోతారేమో! మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన శివాజీరావు 30 ఏళ్ల కిందట రామంతాపూర్ శారదానగర్‌కు తన కుటుంబంతో సహా వచ్చి స్థిరపడ్డారు. శారదానగర్ ప్రధాన రహదారిలో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ చెప్పులు కుట్టే పనిలో బిజీగా ఉంటారు. మధ్యాహ్నం ఓ గంట సేపు నిద్రపోతారు. స్కూల్ పిల్లల షూస్, దివ్యాంగుల చెప్పులకు మాత్రం సగం రేటే తీసుకుంటారు.ఆరోగ్య రహస్యం నడక, జొన్నరొట్టే.. ఈ వయసులో కూడా తాను చెప్పులు కుట్టే వృత్తి నిర్వహిస్తున్నారు. తన వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకులు బస్సులో వెళ్లి తెచ్చుకుంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటని ప్రశి్నస్తే నడక మూడు పూటలా జొన్న రొట్టెను ఆహా రంగా తీసుకుంటానని, ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే అని సమాధానం ఇచ్చారు. రామంతాపూర్‌లో నడక ప్రారంభించి పాలిటెక్నిక్ కాలేజ్ వరకూ నడుస్తానని తెలిపారు. -
డాన్స్ ఇరగదీసిండు..!
-
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్‌తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. స్కూల్‌తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్‌ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్‌కుమార్ -
ఆరోగ్య రహస్యం అదే!
‘‘నేను ఆయిలీ ఫుడ్‌కి దూరంగా ఉంటాను. పండ్ల రసాలు తీసుకుంటాను. రోజూ వ్యాయామం చేస్తాను’’... ‘మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అంటే చాలామంది నుంచి ఇలాంటి సమాధానమే వస్తుంది. కానీ అక్షయ్ కుమార్‌ని అడిగితే.. చాలామంది ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బెల్ బాటమ్’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. స్కాట్‌ల్యాండ్‌లో సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో జరిగిన ఇన్టు ది వైల్డ్ ఇంటర్వ్యూలో అక్షయ్, చిత్రకథానాయికలు హ్యూమా ఖురేషీ, లారా దత్తా పాల్గొన్నారు. ఆ సమయంలో అక్షయ్‌కు ఏనుగు మలంతో తయారు చేసిన టీని ఇచ్చారు. అప్పుడు హ్యూమా ‘మీరు ఏనుగు మలంతో చేసిన టీని ఎలా తాగగలిగారు?’ అని అడిగితే.. ‘‘అదేం పెద్ద సమస్య కాదు. నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం కోసం ప్రతి రోజూ గోమూత్రాన్ని కూడా తాగుతాను. ఆయుర్వేద మెడిసిన్‌లో ఇది చాలా మంచిదని చెబుతారు’’ అన్నారు అక్షయ్. సో.. అక్షయ్ ఆరోగ్య రహస్యం ఇదే అన్నమాట. -
వైఎస్ జగన్ ఆరోగ్య రహస్యం ఇదే..
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం మూడు వేల కిలో మీటర్లకు చేరుకుంది. పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి.. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దినచర్యలో ఏ ఒక్కరోజూ మార్పు లేదు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా.. ఉదయం మాత్రం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. గంట పాటు వ్యాయామం.. కాలకృత్యాలనంతరం ఆరున్నర.. ఏడు గంటల వరకు పత్రికా పఠనం. ఆ తర్వాత ముఖ్యులతో ఫోన్ సంభాషణ. అనంతరం ఉదయం ఏడు.. ఏడున్నర గంటలకు పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో భేటీ. ఆ తర్వాత ఆ రోజు సాగే పాదయాత్ర మార్గాన్ని, ఏ గంటకు ఎక్కడ ఉండాలన్నది అడిగి తెలుసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్రను ప్రారంభించడంలో ఆయనకు ఆయనే సాటి. గ్లాసు జ్యూస్‌తోనే.. ఉదయం అల్పాహారం లేకుండా కేవలం గ్లాస్ జ్యూస్ తాగి జగన్ తన యాత్రను ప్రారంభిస్తారు. రాత్రి ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించినా.. ఉదయం ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికల్లా టెంట్ నుంచి బయటకొస్తారు. రోజూ తెల్లటి చొక్కా, క్రీమ్ కలర్ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ఇవే ఆయన ఆహార్యం. మధ్యాహ్నం ఆయన కేవలం కొన్ని పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పూట ఆహారాన్ని కేవలం ఒకటీ రెండు పుల్కాలు, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు కప్పు పాలు తాగుతారు. ఇప్పటి వరకూ ఇదే ఆయన దినచర్య. మితాహారం, అధిక వ్యాయామంతోనే ఆయన రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. చదవండి: కావాలి జగన్.. రావాలి జగన్.. జననేత వెంట జన ప్రవాహం -
సెంచరీ కొట్టే వయస్సు మాది..
బలివాడ ఆదిలక్ష్మి..ఈ మధ్యనే నూరేళ్ల జన్మదిన వేడుకను జరుపుకుంది. మనమలు..మునిమనమల మధ్య వందేళ్ల బర్త్‌డే కేకునూ కూడా కోసింది. ఆనందోత్సాహాల మధ్య శతవసంతాల పండుగను చేసుకుంది. ఇలాంటి వేడుక ఎంతమందికి సాధ్యమవుతుంది..వందేళ్లు ఆరోగ్యంగా బతికేవారు ఎంతమంది ఉన్నారు..నిజమేమరి..వృద్ధాప్యం భారమైన రోజుల్లో తమ పని తాము చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించడమంటే వరమే. ఇలాంటి వారిని చూస్తే వయోభారమనే పదాన్నే నిఘంటువు నుంచి తొలగించాలనిపిస్తుంది. ఒక్క ఆదిలక్ష్మేనా..మరికొందరూ ఉన్నారు..సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ వందేళ్ల పండగలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిని ఒకసారి పలకరిద్దామా..వారి ఆరోగ్య రహస్యమేమిటో తెలుసుకుందామా.. కోడి కూయక ముందే నిద్ర లేచేవారు..పొద్దు కుంకిన వెంటనే నిద్రపోయేవారు. (ఎర్లీ టు బెడ్ ఎర్లీటు రైజ్ మేక్స్ ఎ మన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్) పనిని ఆస్వాదిస్తూ కాయకష్టం చేసేవారు. శారీరక శ్రమతో పాటు చక్కటి ఆహారం, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఇదీ ఆనాటి వారి జీవనం. అందుకే వందకు చేరువవుతున్నా, సెంచరీ చేసినా భువిపై నాటౌట్‌గా నిలిచారు. నేడు దానికి విరుద్ధంగా జీవనం కొనసాగుతోంది. అందుకే అరవై ఏళ్లకే ఆయుష్షు తీరుతోంది. వందేళ్లకు చేరువయ్యే, దాటిన అవ్వా తాతలను పలకరించగా... వారి ఆరోగ్య రహస్యం, జీవన విధానాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. వేళకు ఆహారం...సమయానికి నిద్ర అరకులోయ: వేళకు ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర పోవడంతోనే వందేళ్లు బతికి ఉన్నాను. నాకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె, వారందరికీ పెళ్లిళ్లు చేశాను. చిన్నతనం నుంచి ఉదయం పూట అంబలి తాగేవాళ్లము. మాంసం కన్నా కూరగాయలు ఎక్కువగా తీసుకుంటాను. పొగ, మద్యం వంటి చెడు అలవాట్లులేవు. సుమారు 30 ఏళ్లుగా వృధాప్య ఫించన్ తీసుకుంటున్నాను. -సరోజిని సాహు, ఎస్బీఐ కాలనీ, అరకు వేళకు దినచర్య సాగాలి గోపాలపట్నం: వేళకు దినచర్య సాగాలి. వేళకు భోంచేయాలి. నిద్రపోవాలి. సదుపాయాలు ఉన్నాయని సుఖపడితే ఆరోగ్యం ఎలా బాగుంటుంది. జీవితం సాధారణంగానే సాగాలి. అతిసుఖం మంచిదికాదు. మనం బాగున్నామన్న సంతృప్తితో ముందుకెళ్లాలి. ఇతరుల కోసం అనవసర ఆలోచనలు కూడదు. అన్నిటికీ ఇతరులపై ఆధారపడటం వల్ల బద్ధకం పెరిగి ఆత్మస్థైర్యం కోల్పోతాం. నాకు 101 ఏళ్లు. భర్త 60 ఏళ్ల వయసులో మృతిచెందారు. వేకువజామున నాలుగున్నర గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుంటాను. టీ తాగుతాను. కొడుకు కోడలు వద్దన్నా ఇంటి పనుల్లో కలియజేసుకుంటాను. ఇల్లు, వాకిలి తుడుస్తాను. నీళ్లు పడతాను. వంట చేస్తాను. ఉదయం 11 గంటలకల్లా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను. మూడు గంటలకు టీ, స్నాక్స్ తీసుకుంటాను. సూర్యాస్తమయం కల్లా భోంచేస్తాను. రాత్రి 7 గంటల కల్లా నిద్రపోతాను. ఇప్పటికీ రోగమంటే ఏంటో తెలీదు. బీపీ, షుగర్లు రాలేదు. దృష్టి లోపం లేదు. తీరిక సమయంలో బియ్యం గింజల్లో రాళ్లేరుతుంటాను. -బలివాడ ఆదిలక్ష్మి, శ్రీరామనగర్ ఆరోగ్య సమస్యలు లేవు నక్కపల్లి/ఎస్‌రాయవరం : నాకు 104 సంవత్సరాలు. ఇప్పటికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో నిత్యం 20 కిలోమీటర్లు నడిచేవాణ్ని. గంటి, వరి, చోడి అన్నం తినేవాణ్ని.ఇప్పటికీ పేపరు చదువుతుంటాను.తెల్లదొరల స్థావరాలను చూశాను. వారిని ఎదిరించిన అల్లూరి సీతారామరాజును పాయకరావుపేట మండలం సీతమ్మవారిమెట్టపై చూశాను. ఆయన చేసే తపస్సు,ధ్యాన కార్యక్రమాలను దగ్గర నుంచి చూశాను. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా ఉప్పలం, రేవుపోలవరం, పెనుగొల్లు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వారితోపాటు కొంతదూరం యాత్రలో పాల్గొన్నాను. 1942లో రాజ రాజేశ్వరితో వివాహం అయింది. ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమంటే ఇష్టం. దాదాపు 80 ఏళ్ల కిందట మట్టి, సున్నంతోకట్టిన పెంకుటింట్లోనే నివశిస్తున్నాను. -పత్సబట్ల అప్పలకొండరాజు, గుడివాడ ఆధారం లేదు..అయితేనేం.. పాడేరు: నాకు 98 ఏళ్లు. నాకు 3 ఏళ్ల వయసులో8 ఏళ్ల వయసు ఉన్న కామేశ్వరరావు అనే దగ్గరి బంధువుతో బాల్య వివాహం జరిపించారు. తండ్రి ఒడిలోనే వివాహం జరిగింది. నాకు ఐదేళ్ల వయసు వచ్చే సరికి భర్త కామేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందాడు. బ్రాహ్మణ ఆచారం ప్రకారం చిన్న తనం నుంచి ఇంటి బయటకు రావడం మానేశాను. తల్లిదండ్రులు కూడా కొంతకాలానికి కాలం చెందారు. 1965లో పాతపాడేరులో ఉన్న సోదరుడు గంటి జగన్నాథస్వామికి ఇంటికి వచ్చి జీవనం సాగించాను. సోదరుడు మృతి చెందడంతో ప్రస్తుతం మేనల్లుడు గంటి గోపాలరావు ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాను. బంధువులు, మేనల్లుడు కుటుంబం కొంత చేదోడు వాదోడుగా ఉంటుండటంతో వారు కల్పించే సహాయ సహకారాలతో ఒంటరిగానే జీవిస్తున్నాను.ఎవరిమీదా ఆధారపడకుండా పనులు చేసుకుంటాను. పూర్వం నుంచి ఒంటిపూట భోజనమే చేస్తున్నాను. రాత్రి వేళ ఆకలి అన్పిస్తే బియ్యం నూకతో ఉప్మా చేసుకుంటాను. 20 ఏళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నాను. పైసా ఆదాయం లేదు. పాలకులు దయ ఉంచి పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. -తాతా కామేశ్వరమ్మ, పాత పాడేరు వందేళ్ల ‘వరం’ తగరపువలస : 1913లో జన్మించాను. అయిదో తరగతి వరకూ చదువుకున్నాను. భీమిలిలోని కుమార్తె శిల్ల సావిత్రమ్మ (75), మనవడు, మనవరాళ్లు, మునిమనమలతో కలిసి ఉంటున్నాను.1972 నుంచి నలభై ఏళ్లుగా కీటిన్‌పేటలో రేషన్ డిపో నిర్వహిస్తున్నాను. అప్పట్లో 8 బస్తాలతో ప్రారంభమైన రేషన్ దుకాణం ఇప్పుడు 150 బస్తాలకు చేరుకుంది. అప్పట్లో దమ్మిడి ఇప్పటి రూపాయితో సమానం. భర్త సూర్యనారాయణ 70 ఏళ్ల కిందట మృతిచెందాడు. ఉదయం మూడు ఇడ్లీ, మధ్యాహ్నం కాయగూరలతో అన్నం, సాయంత్రం చపాతి, తీసుకుంటాను. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ దుకాణానికి నడిచివెళ్లి వస్తుంటాను. అది కూడా ఆరోగ్య రహస్యానికి కారణం కావచ్చు. గొప్పులు తవ్వడం తదితర వ్యవసాయ పనుల్లో కూడా పాలుపంచుకుంటాను.స్వాతంత్య్రోద్యమ కాలంలో భీమిలి విచ్చేసిన మహాత్ముడిని చూశాను. - నీలాపు వరహాలమ్మ(102), భీమిలి మా పనులు మేమే చేసుకుంటాం అనకాపల్లిరూరల్: 101వ సంవత్సరంలో అడుగిడుతున్నాను. నా భార్య రమణమ్మకు 95 ఏళ్లు. ఈ వయసులో కూడా మేమిద్దరం ఉత్సాహంగా ఉంటున్నాం. మేము ఎవరి మీదా ఆధారపడకుండా మా పనులు మేమే చేసుకుంటాం. వేళకు భోజనం చేస్తుంటాను. ఉదయం 8 గంటల సమయంలో ఒక టీ మాత్రమే తాగుతాను. ఉదయం 11 గంటలకు కాయగూరలు, చారుతో కూడిన అన్నం తీసుకుంటాను. సాయితం 6 గంటలకు ఒక టీ మాత్రమే తాగుతాను. రాత్రి పూట భోజనం మానేసి సుమారు 15 ఏళ్లు అవుతుందన్నారు. మాంసాహారం తప్పని సరి కాదు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి పేపర్ చదువుతాను. తహశీల్దారు కార్యాలయానికి నడుచుకుని వెళ్లి అర్జీలు ఇస్తుంటాను. మాకు 8 మంది సంతానం. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. -భార్యతో చింతా ధర్మారావు వ్యాయామంతో చక్కటి ఆరోగ్యం నర్సీపట్నం: నాకు 90 ఏళ్లు పూర్తయ్యాయి. నేను ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందాను. ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉన్నారు. ముగ్గురు పిల్లలూ ఉపాధ్యాయులే. చిన్ననాటి నుంచి క్రమం తప్పకుండా వ్యాయమం చేయటంతో పాటు క్రీడల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేవాణ్ని. చిన్న నాటి నుంచి శాకాహారం తీసుకోవడంతో పాటు పరిమిత ఆహారం తీసుకునేవాణ్ని. రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి, గంటపాటు ఇంటి చుట్టూ వాకింగ్ చేస్తాను. సంగీతం వింటాను. వాకింగ్ అనంతరం కళ్ల అద్దాల అవసరసరమే లేకుండా దినపత్రికలు చదువుతాను. -కొర్తి సత్యనారాయణ మూర్తి, విశ్రాంత ఉపాధ్యాయుడు -
పాపీ.. చిరాయువు..
మితాహారం తీసుకోవడం, వ్యాయా మం చేయడం, అప్పుడప్పుడు కబాబ్‌లు తినడం ఇదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది చిత్రంలోని పాపీ అనే మార్జాలం. దాని ఆరోగ్య రహస్యం మనకెందుకంటారా? అంటే.. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిని కలిస్తే.. మనమనడిగేది ఇదే కదా.. అదే లెక్కన ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పిల్లి. దీని వయసు 24 సంవత్సరాలు. అంటే.. మన మనుషుల లెక్కలో తీసుకుంటే.. దీని వయసు 114 సంవత్సరాలకు సమానమన్నమాట. బ్రిటన్‌లోని డోర్సెట్‌లో ఉండే పాపీని అత్యంత వృద్ధురాలైన మార్జాలంగా గిన్నిస్ బుక్‌వారు కూడా గుర్తించారు. దీని యజమాని పేరు జాకీ వెస్ట్. వయసు మీద పడటంతో ప్రస్తుతం పాపీకి సరిగా వినిపించడం లేదు.. కనిపించడం లేదు. అయితేనేం.. ఇంట్లో చలాకీగా తిరుగుతూ హడావుడి చేస్తూనే ఉంటుందని జాకీ వెస్ట్ చెప్పారు.