రామంతాపూర్: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని సోమరిపోతులైన యువకులను ఉద్దేశించి అన్నాడో మహా కవి. దానిని సవరించుకుంటూ కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు అని శివాజీరావును చూస్తే అనిపిస్తుంది. 90 ఏళ్ల వయస్సులో మనకు తెలిసి చాలా మంది మంచానికే పరిమితమైపోతారు. అనేక అనారోగ్య సమస్యలో ఇబ్బందిపడుతుంటారు. కాని శివాజీరావును చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే.. ఎందుకంటే ఇప్పటికీ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, కళ్లు మసకబారడం వంటి సమస్యలేవీ ఆయన దరిదాపుల్లోకి రాలేకపోయాయి అంటే ఆశ్చర్యపోతారేమో!
మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన శివాజీరావు 30 ఏళ్ల కిందట రామంతాపూర్ శారదానగర్‌కు తన కుటుంబంతో సహా వచ్చి స్థిరపడ్డారు. శారదానగర్ ప్రధాన రహదారిలో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ చెప్పులు కుట్టే పనిలో బిజీగా ఉంటారు. మధ్యాహ్నం ఓ గంట సేపు నిద్రపోతారు. స్కూల్ పిల్లల షూస్, దివ్యాంగుల చెప్పులకు మాత్రం సగం రేటే తీసుకుంటారు.
ఆరోగ్య రహస్యం నడక, జొన్నరొట్టే..
ఈ వయసులో కూడా తాను చెప్పులు కుట్టే వృత్తి నిర్వహిస్తున్నారు. తన వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకులు బస్సులో వెళ్లి తెచ్చుకుంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటని ప్రశి్నస్తే నడక మూడు పూటలా జొన్న రొట్టెను ఆహా రంగా తీసుకుంటానని, ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే అని సమాధానం ఇచ్చారు. రామంతాపూర్‌లో నడక ప్రారంభించి పాలిటెక్నిక్ కాలేజ్ వరకూ నడుస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment