పాపీ.. చిరాయువు.. | She's feline her age! Poppy named world's oldest cat at 24 | Sakshi
Sakshi News home page

పాపీ.. చిరాయువు..

Published Tue, May 20 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

పాపీ.. చిరాయువు..

పాపీ.. చిరాయువు..

మితాహారం తీసుకోవడం, వ్యాయా మం చేయడం, అప్పుడప్పుడు కబాబ్‌లు తినడం ఇదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది చిత్రంలోని పాపీ అనే మార్జాలం. దాని ఆరోగ్య రహస్యం మనకెందుకంటారా? అంటే.. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిని కలిస్తే.. మనమనడిగేది ఇదే కదా.. అదే లెక్కన ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పిల్లి. దీని వయసు 24 సంవత్సరాలు. అంటే.. మన మనుషుల లెక్కలో తీసుకుంటే.. దీని వయసు 114 సంవత్సరాలకు సమానమన్నమాట. బ్రిటన్‌లోని డోర్సెట్‌లో ఉండే పాపీని అత్యంత వృద్ధురాలైన మార్జాలంగా గిన్నిస్ బుక్‌వారు కూడా గుర్తించారు. దీని యజమాని పేరు జాకీ వెస్ట్. వయసు మీద పడటంతో ప్రస్తుతం పాపీకి సరిగా వినిపించడం లేదు.. కనిపించడం లేదు. అయితేనేం.. ఇంట్లో చలాకీగా తిరుగుతూ హడావుడి చేస్తూనే ఉంటుందని జాకీ వెస్ట్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement