Pappy
-
పాపీ.. చిరాయువు..
మితాహారం తీసుకోవడం, వ్యాయా మం చేయడం, అప్పుడప్పుడు కబాబ్‌లు తినడం ఇదే తన ఆరోగ్య రహస్యమని చెబుతోంది చిత్రంలోని పాపీ అనే మార్జాలం. దాని ఆరోగ్య రహస్యం మనకెందుకంటారా? అంటే.. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిని కలిస్తే.. మనమనడిగేది ఇదే కదా.. అదే లెక్కన ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పిల్లి. దీని వయసు 24 సంవత్సరాలు. అంటే.. మన మనుషుల లెక్కలో తీసుకుంటే.. దీని వయసు 114 సంవత్సరాలకు సమానమన్నమాట. బ్రిటన్‌లోని డోర్సెట్‌లో ఉండే పాపీని అత్యంత వృద్ధురాలైన మార్జాలంగా గిన్నిస్ బుక్‌వారు కూడా గుర్తించారు. దీని యజమాని పేరు జాకీ వెస్ట్. వయసు మీద పడటంతో ప్రస్తుతం పాపీకి సరిగా వినిపించడం లేదు.. కనిపించడం లేదు. అయితేనేం.. ఇంట్లో చలాకీగా తిరుగుతూ హడావుడి చేస్తూనే ఉంటుందని జాకీ వెస్ట్ చెప్పారు. -
నేనూ నా పప్పీ!
పెట్ లవ్- అనుష్క శర్మ మా పమేరియన్ పప్పీ అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. పాటల్లో చెబుదామంటే నేను కవిని కాదు. అయినా సరే...నా ఇష్టాన్ని మీతో పంచుకుంటాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే మాట చాలా సార్లు సినిమాల్లో విన్నాను. ఈ మాట నా అనుభవంలోకి పప్పీ వల్లే వచ్చింది. ముప్పై రోజుల ముద్దుల పప్పీని చూసీ చూడగానే ప్రేమలో పడిపోయాను. కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని పప్పీతో ఆడుకున్న రోజులున్నాయి. మా పప్పీ నిద్రపోనిదే నేను నిద్రపోను. మా పప్పీకీ నేనే తల్లి అనుకొని మురిసిపోతాను. ఈమధ్య ఫిల్మ్ షెడ్యూల్స్‌లో బిజీగా ఉండడం వల్ల పప్పీని మిస్ అవుతున్నాను. షూటింగ్ కోసం వేరే ప్రాంతాలలో ఉన్నప్పుడు పొద్దున లేవగానే పప్పీ గుర్తుకు వచ్చి వెలితిగా అనిపిస్తుంది. ‘నేను పప్పీ గురించి ఆలోచించినట్లు, బాధ పడినట్లు అది కూడా నా గురించి ఆలోచిస్తుందా?’ షూటింగ్ విరామంలో తోటి నటులతో మాట్లాడుతున్నప్పుడు పప్పీ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘‘ఎప్పుడూ పప్పీ గురించి చెప్పి బుర్ర తింటుంది’’ అని వాళ్లు మనసులో అనుకుంటారేమో తెలియదుగానీ నాకైతే పప్పీ గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం.