పెట్ లవ్- అనుష్క శర్మ
మా పమేరియన్ పప్పీ అంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. పాటల్లో చెబుదామంటే నేను కవిని కాదు. అయినా సరే...నా ఇష్టాన్ని మీతో పంచుకుంటాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే మాట చాలా సార్లు సినిమాల్లో విన్నాను. ఈ మాట నా అనుభవంలోకి పప్పీ వల్లే వచ్చింది. ముప్పై రోజుల ముద్దుల పప్పీని చూసీ చూడగానే ప్రేమలో పడిపోయాను.
కొన్నిసార్లు రాత్రంతా మేలుకొని పప్పీతో ఆడుకున్న రోజులున్నాయి. మా పప్పీ నిద్రపోనిదే నేను నిద్రపోను. మా పప్పీకీ నేనే తల్లి అనుకొని మురిసిపోతాను. ఈమధ్య ఫిల్మ్ షెడ్యూల్స్‌లో బిజీగా ఉండడం వల్ల పప్పీని మిస్ అవుతున్నాను. షూటింగ్ కోసం వేరే ప్రాంతాలలో ఉన్నప్పుడు పొద్దున లేవగానే పప్పీ గుర్తుకు వచ్చి వెలితిగా అనిపిస్తుంది.
‘నేను పప్పీ గురించి ఆలోచించినట్లు, బాధ పడినట్లు అది కూడా నా గురించి ఆలోచిస్తుందా?’ షూటింగ్ విరామంలో తోటి నటులతో మాట్లాడుతున్నప్పుడు పప్పీ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘‘ఎప్పుడూ పప్పీ గురించి చెప్పి బుర్ర తింటుంది’’ అని వాళ్లు మనసులో అనుకుంటారేమో తెలియదుగానీ నాకైతే పప్పీ గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం.
నేనూ నా పప్పీ!
Published Tue, Feb 18 2014 6:14 AM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM
Advertisement
Advertisement