ఆరోగ్య రహస్యం అదే! | Akshay Kumar drinking cow urine daily | Sakshi
Sakshi News home page

ఆరోగ్య రహస్యం అదే!

Published Sat, Sep 12 2020 3:25 AM | Last Updated on Sat, Sep 12 2020 4:57 AM

Akshay Kumar drinking cow urine daily - Sakshi

‘‘నేను ఆయిలీ ఫుడ్‌కి దూరంగా ఉంటాను. పండ్ల రసాలు తీసుకుంటాను.  రోజూ వ్యాయామం చేస్తాను’’... ‘మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అంటే చాలామంది నుంచి ఇలాంటి సమాధానమే వస్తుంది. కానీ అక్షయ్‌ కుమార్‌ని అడిగితే.. చాలామంది ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బెల్‌ బాటమ్‌’ షూటింగ్‌ అక్కడ జరుగుతోంది.

స్కాట్‌ల్యాండ్‌లో సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో జరిగిన ఇన్‌టు ది వైల్డ్‌ ఇంటర్వ్యూలో అక్షయ్, చిత్రకథానాయికలు హ్యూమా ఖురేషీ, లారా దత్తా పాల్గొన్నారు. ఆ సమయంలో అక్షయ్‌కు ఏనుగు మలంతో తయారు చేసిన టీని ఇచ్చారు. అప్పుడు హ్యూమా ‘మీరు ఏనుగు మలంతో చేసిన టీని ఎలా తాగగలిగారు?’ అని అడిగితే.. ‘‘అదేం పెద్ద సమస్య కాదు. నేను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం కోసం ప్రతి రోజూ గోమూత్రాన్ని కూడా తాగుతాను. ఆయుర్వేద మెడిసిన్‌లో ఇది చాలా మంచిదని చెబుతారు’’ అన్నారు అక్షయ్‌. సో.. అక్షయ్‌ ఆరోగ్య రహస్యం ఇదే అన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement