258వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 258th Prajasankalpayatra Started In Visakapatnam | Sakshi
Sakshi News home page

258వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Sun, Sep 9 2018 8:34 AM | Last Updated on Sun, Sep 9 2018 9:06 AM

YS Jagan 258th Prajasankalpayatra Started In Visakapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 258వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖటపట్నం నియోజకవర్గంలోని గోపాలపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గోపులపట్నం జంక్షన్‌, బాజీ జంక్షన్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా ఓల్డు కరాస వరకు పాదయాత్ర సాగనుంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.

ఓల్డు కరాసకు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మర్రిపాలెం మీదుగా పశ్చిమ విశాఖ, ఉత్తర విశాఖపట్నం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం పశ్చిమ విశాఖపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించిన తర్వాత కంచరపాలెంలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement