విక్టరీ వెంకటేశ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటీవలె విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ ప్రస్తుతం కొత్త కథలు వినేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా.. ఆధ్యాత్మిక సాధన నేపథ్యంలో కొంతకాలం వరకు ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. మొదటి నుంచి వెంకటేశ్‌కు ఆధ్యాత్మికత ఎక్కువే. ఈ కారణంగానే ఆయన కొన్ని రోజుల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారట. విరామం తర్వాత కొత్త సినిమాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. కాగా వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment