Is Samantha Walks Out of Her Bollywood Films Due to Health Issue - Sakshi
Sakshi News home page

Samantha: సమంత షాకింగ్‌ నిర్ణయం! ఆ సినిమాల నుంచి సామ్‌ అవుట్‌?

Published Tue, Dec 20 2022 2:12 PM | Last Updated on Tue, Dec 20 2022 3:22 PM

Is Samantha Walks Out of Her Bollywood Films Due to Health Issue - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ అనే ఇమ్యూన్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సామ్‌ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం సామ్‌ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో సామ్‌ బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె అక్కడ వరుస ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషి చిత్రంతో పాటు తమిళంలోనూ పలు సినిమాకు సంతకం చేసింది.

వీటితో పాటు ఓ హాలీవుడ్‌ మూవీకి కూడా ఒకే చెప్పింది. దీంతో ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు క్యూలో ఉన్నాయి. పాన్‌ ఇండియా మూవీ శాకుంతలం అనంతరం సామ్‌ వరుసగా పలు చిత్రాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే తాను మయోసైటిస్‌ బారిన పడటంతో ప్రస్తుతం స్వల్ప కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. బాలీవుడ్‌ సినిమాల విషయంలో సామ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఖషి సినిమా తర్వాత ఆమె నటనకు, షూటింగ్‌లకు లాంగ్‌ బ్రేక్‌ తీసుకోవాలని అనుకుంటోందట. ఇదే విషయాన్ని తను సంతకం చేసిన మూవీ నిర్మాతలకు చెప్పిందట.  సమంత నిర్ణయాన్ని బాలీవుడ్‌ నిర్మాతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సామ్‌ సంతకం చేసిన బాలీవుడ్‌ చిత్రాల నిర్మాతలు సినిమా ఆలస్యం అయితే తమకు నష్టమని, మిగతా నటీనటుల కాల్షిట్‌ దృష్ట్యా కూడా సమంత నిర్ణయాన్ని వారు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సామ్‌ ఆ ప్రాజెక్ట్స్‌ నుంచి తప్పుకున్నట్లు ఫిలిం దూనియాలో టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

చదవండి: 
శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు
ఫైనలిస్ట్‌గా కీర్తి.. ఆమె 15 వారాల రెమ్యునరేషన్‌ ఎంతంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement