Director Shankar Completes 30 Years In Industry - Sakshi
Sakshi News home page

S. Shankar: ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 వసంతాలు.. అసలైన గేమ్‌ ఛేంజర్‌ ఇతడే!

Published Mon, Jul 31 2023 11:39 AM | Last Updated on Mon, Jul 31 2023 11:49 AM

Shankar Completes 30 Years Industry - Sakshi

చిత్ర పరిశ్రమలో అందరూ సినిమాను ప్రేమించే వారే. అయితే సినిమానే శ్వాసగా భావించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు శంకర్‌ ఒకరు. తొలి చిత్రంతోనే స్టార్‌ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన తొలి చిత్రం జెంటిల్మెన్‌. అర్జున్‌, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై ఆదివారం (జూలై 30) నాటికి 30 వసంతాలు పూర్తి చేసుకుంది. తొలి ప్రయత్నంలోనే శంకర్‌ ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకొని కమర్షియల్‌ అంశాలు చొప్పించి ప్రయోజనాత్మక, జనరంజక కథా చిత్రంగా జెంటిల్‌మెన్‌ను మలిచారు.

ఆ తర్వాత కూడా శంకర్‌ తన చిత్రాల్లో సామాజిక అంచాలను తెరపై ఆవిష్కరించడాన్ని విస్మరించలేదు. ఇక ఒక దర్శకుడిగా 30 ఏళ్ల క్రితం ఉదయించిన శంకర్‌ ఇప్పటికి 13 చిత్రాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఈయన తమిళంలో ఇండియన్‌– 2, తెలుగులో గేమ్‌ ఛేంజర్‌ చిత్రాలను చేస్తున్నారు. అలా తక్కువ చిత్రాలు చేసినా నేడు టాప్‌ 10 దర్శకుల్లో ఒకరిగా రాణించటం శంకర్‌కే చెల్లింది.

ఇప్పటి వరకు ముదల్‌ వన్‌, బాయ్స్‌, ఇండియన్‌, ఎందిరన్‌, శివాజీ, రోబో –2, నన్బన్‌ తదితర చిత్రాలు బ్రహ్మాండానికి నిదర్శనంగా నిలిచాయి. అందుకే శంకర్‌ను బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు అని పేర్కొంటారు. కాగా జెంటిల్‌మెన్‌ చిత్రం 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శిష్య బృందం (జెంటిల్మెన్‌ , ఇండియన్‌ 2, గేమ్‌ ఛేంజర్‌ చిత్రాలకు పనిచేసిన సిబ్బంది) ఆదివా రం చైన్నెలోని శంకర్‌ కార్యాలయంలో ఆనందంగా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఈ వేడుకలో శంకర్‌ పాల్గొని కేకను కట్‌ చేశారు.

చదవండి: ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బాలీవుడ్‌ జంట

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement