
పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఇది 2021లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట సింహ కీలక పాత్రలు పోషించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.
శనివారం నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను. తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మనేసింది.
A PRESENCE TO BE FELT. #Odela2 on April 17th. 🙏@iamsampathnandi @dimadhu @alle_ashok_teja @ihebahp@imsimhaa @b_ajaneesh @soundar16 @neeta_lulla@madhucreations9 pic.twitter.com/ihUozJX6Rt
— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 22, 2025
చదవండి: నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే
Comments
Please login to add a commentAdd a comment