kingdom
-
సాలీళ్లు బాబోయ్! సాలీళ్లు! ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి..
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.నల్లులతో నానా యాతన..!అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్హార్న్డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ నుంచి కొత్త టీజర్
ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్ హెచ్. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. వెస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘వెల్కమ్ టు మై కింగ్డమ్’, ‘బెండ్ ఫర్ యువర్ కింగ్’, ‘..నెవర్’ అనే డైలాగ్స్ ఈ టీజర్లో ఉన్నాయి. ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ రీ బూట్ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011)’, ‘డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2014), ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. -
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
పిల్లల కథ -‘తెలిసొచ్చింది మహా ప్రభో’
మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు. సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు. వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి -
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
విలువైన భోజనం
ఒకసారి ఛత్రపతి శివాజీ ఆగ్రాపై దండయాత్ర అనంతరం తిరిగి తన రాజ్యానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తన రాజ్యంలోని ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకున్నాడు. తీవ్రమైన అలసటతో, ఆకలితో ఉండడం వల్ల దగ్గరలోని ఒక ఇంటికి వెళ్లి ఆ గృహిణిని ఆహారం పెట్టమని కోరాడు శివాజీ. సాధువు వేషంలో ఉన్న శివాజీని ఆ ఇల్లాలు గుర్తించలేదు. కాసేపు ఆగితే వంట చేసి భోజనం వడ్డిస్తానని చెప్పింది ఆదరంగా. ఎదురు చూస్తూ కూర్చున్నాడు శివాజీ. కాసేపటికి శివాజీని పిలిచి అరటి ఆకు వేసి అందులో అన్నం వడ్డించింది. పాత్రలో పప్పు పెట్టింది. కుంభంలా ఉన్న అన్నం మీద పప్పు పోసుకున్నాడు శివాజీ. అరటి ఆకుకు అంచులు లేనందున అన్నం మీద నుండి పప్పు ఆకు బయటకు పారింది. ఆ దృశ్యం చూసిన గృహిణి ‘‘నువ్వూ మన రాజుగారు శివాజీ లానే చేస్తున్నావే! అరటి ఆకు మీద నుండి పప్పు బయటకు పోకుండా చుట్టూ అన్నంతో కట్టుకట్టాలని తెలియదా?’’ అని అడిగింది. శివాజీ ఉలిక్కిపడ్డాడు. తరువాత సంతృప్తిగా భోజనం ముగించి గృహిణికి కృతజ్ఞతలు చెప్పుకుని బయల్దేరాడు. శివాజీ రాజ్యాన్ని అయితే విస్తరించాడు కానీ రాజ్యం చుట్టూ సరైన ఎల్లలు నిర్మించి కట్టుదిట్టం చేయకపోవడం వలన తరచూ శత్రువులు రాజ్యంలో సులువుగా ప్రవేశించి దాడులు జరిపేవారు. తనకు ఆతిథ్యం ఇచ్చిన ఆమె పలికిన మాటలు శివాజీ పొరపాటుని ఎత్తి చూపించడమే కాకుండా కర్తవ్యాన్ని బోధించాయి. కొన్నిసార్లు విలువైన పాఠాలు కూడా మామూలు సందర్భాలలోనే జనించి ఊహించని మేలు చేస్తాయని మనసులో అనుకున్నాడు శివాజీ. – అమ్మాజీ గుడ్ల -
సంతోషం నీలోనే ఉంది
ఆ రాజుగారికి అన్నీ వున్నాయి. కాని ఎప్పుడూ సంతోషం కోసం వెతుకులాట. రాజుగారిలో అసంతృప్తి, విచారం అణువణువునా కనబడుతుంది. రాజ వైద్యులుగాని, మహామంత్రిగాని, మంత్రులుగాని, సామంతులు గాని, ప్రజలు గాని, పండితులు గాని రాజుగారి సుఖం కోసం సూచనలివ్వలేక పోతున్నారు. రాజ్యమంతా చాటింపు వేయించారు. రాజుగారి అసంతోషానికి కారణం చెప్పాలని, లేదా సుఖం ఎలా కలుగుతుందో సూచించాలని. ఒకరోజు ఒక పండితులవారొచ్చి ‘‘రాజా! మీకు సుఖం కలిగే మార్గం చెబుతాను. మీరు మన రాజ్యంలో ఎవరయినా వ్యక్తి ‘నేను సుఖంగా వున్నాను’ అంటే అతని నుంచి, అతను వాడే ఏదయినా వస్తువును తీసుకురమ్మనండి. ఆ వస్తువును మీరు ధరిస్తే మీకు సంతోషం కలుగుతుంది’’ అని చెప్పారు. ఈ సలహా రాజుగారికి మంచిగా అనిపించి, రాజ్యంలో సుఖంగా వున్నారనుకుంటున్న వ్యక్తుల వద్దకు మంత్రిని, దూతలను పంపించారు. వారు బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారస్తుని వద్దకు వెళ్ళి అడిగితే అతనన్నాడు ‘‘నా దగ్గర చాలా వస్తువులున్నాయి. కావలసినవి పట్టకెళ్ళండి. కాని నేను మాత్రం సుఖంగా లేను. నా వ్యాపారమింకా దశదిశలా పోలేదు, అన్యుల వ్యాపార వస్తువులు అక్కడక్కడ కనబడుతున్నాయి. అవి ఉండకూడదు. అంతవరకు నాకు సుఖముండదు’’ అన్నాడు. ప్రముఖ కళాకారుని వద్దకు వెళితే అతనన్నాడు ‘‘నాకు చాలా ప్రాచుర్యముంది. వేలాదిమంది అభిమానులున్నారు. కీర్తి, సంపదలున్నాయి కాని సుఖం లేదు. ఎందుకంటే దేశంలో నేనొక్కడనే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు కళాకారులున్నారు. నేనొక్కడినే వుండాలి. నన్నొక్కడినే ప్రజలాదరించాలి. అంతవరకు నాకు సంతోషముండ దు’’ అన్నాడు. ఇలా దేశంలో ఎవరిని కదిలించినా, ఏదోఒక అసంతృప్తితో వున్నవారే తప్పిస్తే, సుఖంగా ఉన్నట్టు చెప్పలేక పోతున్నారు. దేశమంతా తిరుగుతూ ఒకరోజు అలసిపోయి మంత్రిగారు, సైనికులు సేదదీరుతున్నారు. దూరంగా బండి దగ్గర కూర్చొని, ఒకతను నేలపై ఆకుపరుచుకొని అందులో అన్నం తింటూ ‘‘నేను సుఖంగా ఉన్నాను, నాకు కోరికలు లేవు, నాకన్నీ వున్నాయి, నాకింకేమీ అక్కరలేదు అనుకుంటూ, పాడుకుంటూ పరిసరాలను మరచి తన్మయత్వంతో వున్నాడు. ఆ పాట విన్న మంత్రిగారు, సైనికులు అతనివద్దకు వెళ్ళి ‘‘నువ్వు సంతోషంగా వున్నానని పాడుకుంటున్నావు. నిజంగానే సుఖంగా వుంటే నువ్వుపయోగించే ఏ వస్తువైనా ఇవ్వమన్నారు. ‘‘నేను సంతోషంగానే ఉన్నాను కానీ, క్షమించండి మహారాజా! నా దగ్గరేమీలేదు, నే కట్టుకున్న గోచీగుడ్డ తప్ప. అసలు సుఖానికి, అన్ని సౌకర్యాలు కలిగివుండడానికి సంబంధమేంటి?’’ అని ఎదురు ప్రశ్న వేసాడు. ‘‘అదంతా రాజుగారు చెబుతారు గానీ, నువ్వు మా వెంట రావాలి’’ అని వారు ఎంత చెప్పినా రాను పొమ్మన్నాడు. అవసరమనుకుంటే రాజును తన వద్దకు రమ్మన్నాడు. చేసేదిలేక రాజుగారు మంది మార్బలంతో, సైనికులతో, బహుమతులతో వచ్చారు. అప్పటికి రైతు అలసి నిద్రపోతున్నాడు. మంత్రిగారు రాజుగారొచ్చిన విషయం చెప్పాడు. ‘‘నేనిప్పుడు నిద్రపోతున్నాను, రేపు రమ్మన్నాడు. రాజుగారు వెనుదిరిగి పోయి మరునాడు సాధారణ పౌరునిలాగ వచ్చి రైతు ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి ‘‘స్వామీ’’ అన్నాడు. ‘‘రాజా! వచ్చావా? కూర్చో. ఇప్పుడు చెప్పు నీ సమస్యేంటి?’’ అన్నాడు. ‘‘స్వామీ నాకన్నీ వున్నాయి కాని సుఖం లేదు. అది ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పమన్నాడు రాజు. ‘‘రాజా! సుఖాలకు కారకాలు వస్తువులు కాదు. సంపదలు, ధనధాన్యాలు కావు. సుఖాన్నిచ్చేది ఆత్మ. ఎవరు తనలోనున్న ఆత్మను తెలుసుకుంటారో వారికి బయటి వస్తువులతో పనేముంటుంది? ఆనందం, సుఖం ఆత్మకు సంబంధించినది. మనిషి తనకోసం, తన సుఖంకోసం ఆలోచిస్తాడు. వేటివల్ల తనకు సుఖం కలుగుతుందో వాటికోసం వెంపర్లాడుతాడు. అవి అశాశ్వితాలు. ఆ సుఖం ఆ వస్తువున్నంత వరకే. అది శాశ్వతం కాదు. శాశ్వత సుఖం ఆత్మజ్ఞానంలోనే వుంది. ఆ ఆత్మజ్ఞానం నీలోనే ఉంది. అదే శాశ్విత సుఖం’’ అన్నాడు బండి తోలుకునే అతను. రాజు ముఖం అలౌకికానందంతో తేజోవంతమైంది. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
శత్రు స్థావరం
సిరియా రాజుకు ఇజ్రాయేలుతో యుద్ధం చేయాలని ఆలోచన. అతను ఆ రాజ్యం బయట ఏ ప్రాంతం నుంచి దాడి చేసినా సిరియా సైన్యాన్ని ఇజ్రాయేలు రాజు సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఎవరికీ తెలియకుండా యుద్ధ వ్యూహాన్ని రచించినా ఇజ్రాయేలు రాజు తన వ్యూహాన్ని ఎలా తెలుసుకుంటున్నాడో అంతుపట్టలేదు. దాంతో సిరియా రాజు తన సైనికులను పిలిపించి మనం వ్యూహం గురించి ఇజ్రాయేలు రాజుకు మీరే చెబుతున్నారని, చెప్పింది ఎవరో తనకు తెలియాలని అన్నాడు. సైనికులలో ఒకరు ‘‘మేమెవ్వరమూ చెప్పడం లేదు రాజా! ఆ ప్రాంతంలో ఎలీషా అని ఒక భక్తుడున్నాడు, ఇక్కడి మీ ఆలోచన అతను తెలుసుకుని ఆ విషయాన్ని ఇజ్రాయేలు రాజుకు తెలుపుతున్నాడు’’ అని చెప్పారు. ‘‘అయితే ముందుగా ఆ భక్తుడిని నా వద్దకు రప్పిం^è ండి’’ అని సిరియా రాజు ఆజ్ఞాపించాడు. సిరియా సైనికులు ఎలీషా దోతాను పట్టణంలో ఉన్నాడని తెలుసుకుని పట్టణాన్ని చుట్టుముట్టారు. విషయం తన శిష్యుని ద్వారా తెలుసుకున్న ఎలీషా తానే ఆ సైనికుల వద్దకు వెళ్లాడు, భక్తుడైన ఎలీషా ప్రార్థన చేయడంతోటే దేవుడి మహిమతో సిరియారాజు సైన్యం మొత్తానికి కళ్లు కనిపించకుండా పోయాయి. అప్పుడు ఎలీషా వారి వద్దకు వచ్చి ‘‘మీరు వెదుకుతున్న ఎలీషాను నేను చూపిస్తాను రండి’’ అని వారిని వెంటబెట్టుకుని ఇజ్రాయేలు సైనిక స్థావరమైన షోమ్రోను పట్టణానికి తీసుకు వెళ్లాడు. ఎలీషా ప్రార్థన మేరకు దేవుడు ఆ సైనికులకు తిరిగి దృష్టిని ఇచ్చాడు. వారు కళ్లు తెరిచి చూసి తాము ఇజ్రాయేలు సైనిక స్థావరమైన షోమ్రోనుకు తేబడ్డామనే విషయం అర్థమై భయంతో వణికిపోయారు. అప్పుడు ఇజ్రాయేలు రాజు ఎలీషాను ‘‘నాయనా వారిని చంపుదుమా’’ అని అyì గాడు. భక్తుడైన ఎలీషా ‘‘వద్దు, వారికి భోజనం పెట్టి పంపించమని’’ చెప్పి వెళ్లిపోయాడు. అతని మాట మేరకు ఇజ్రాయేలు రాజు అనేక వంటకాలను చేయించి సిరియా సైన్యానికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. తమ సైనికులు రాలేదని కలవరపడుతున్న సిరియా రాజు వద్దకు తిరిగి ఆ సైన్యం వెళ్లి విషయం మొత్తం చెప్పగానే రాజు హృదయం మారి ఇజ్రాయేలు మీద యుద్ధం చేయాలనే ఆలోచన మానుకున్నాడు.శత్రువుకు భోజనం పెట్టాలనే భక్తుని ఒక ఆలోచన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది, శత్రువు దొరకగానే హాని చేయాలనే ఆలోచన కాకుండా వారిని ప్రేమించాలనే తలంపు వస్తే చాలా సమస్యలు తీరిపోతాయి. – రవికాంత్ బెల్లంకొండ -
సత్యనిష్ఠ
‘ఆడిన మాట తప్పని రాజులు ఎవరైనా ఉన్నారా?’ అని ఇంద్రసభలో ఒకసారి చర్చ వచ్చింది. భూలోకంలో హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడని వశిష్టుడు చెప్పాడు. వశిష్ట విశ్వామిత్రులకు మొదటినుంచి వైరం ఉంది. అందువల్ల హరిశ్చంద్రుడి చేత ఎలాగైనా అబద్ధం చెప్పించాలని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి వద్దకెళ్లి తాను ఒక బృహత్తర యాగం తలపెట్టాననీ, దానికి విశేషంగా ధనం కావాలన్నాడు. యాగ నిర్వహణకు ఎంత అవసరమైతే అంత ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు. తనకు కావలసి వచ్చినప్పుడు వచ్చి ధనాన్ని తీసుకుంటానని విశ్వామిత్రుడు వెళ్లిపోయాడు. ఒకసారి హరిశ్చంద్రుడి రాజ్యంలోని కొందరు ప్రజలు వచ్చి తమ పైర్లన్నిటినీ అడవిమృగాలు పాడుచేస్తున్నాయని చెప్పడంతో వాటిని సంహరించేందుకు అడవులకు వెళ్లాడు. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించేందుకు రకరకాల కుయుక్తులు, కుట్రలు పన్నిన విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను సృష్టించి, హరిశ్చంద్రుని వద్దకు పంపాడు. వారు ఆయన వద్దకొచ్చి తమను పెళ్లాడమని కోరారు. హరిశ్చంద్రుడు తిరస్కరించాడు. వారిని విశ్వామిత్రుడు వెంటబెట్టుకుని వెళ్లి వారిని పెళ్లి చేసుకోమని ఆదేశించాడు. ఏకపత్నీవ్రతాన్ని తప్పనన్నాడు హరిశ్చంద్రుడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు అతడు తన యాగానికి కావలసిన ధనాన్ని ఇస్తానన్న సంగతి గుర్తుచేసి, ఇప్పుడు అవసరమొచ్చింది, ఇమ్మన్నాడు. ఎంత ధనం ఇచ్చినా చాలదంటుండడంతో చేసేదేం లేక హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని, కొడుకు లోహితుణ్నీ తీసుకుని రాజ్యం విడిచి వెళ్లిపోయాడు. అదీ చాలదన్నాడు విశ్వామిత్రుడు. దాంతో కాశీనగరంలో చంద్రమతిని విక్రయించి, ఆ వచ్చిన ధనాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చాడు. అది కూడా చాలదన్నాడాయన. దాంతో తానే స్వయంగా ఓ కాటికాపరికి అమ్ముడుపోయాడు. ఓ రాత్రివేళ హరిశ్చంద్రుడి కొడుకు లోహితుణ్ణి పాము కరవడంతో అతను మరణించాడు. చంద్రమతి కొడుకు దేహాన్ని కాటికి తీసుకువెళ్లింది. సుంకం చెల్లించమన్నాడు కాటికాపరి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయిందా ఇల్లాలు. ఆ మెడలోని మంగళసూత్రాలు అమ్మి చెల్లించమన్నాడు కాపరి. తన మాంగల్యం భర్తకు తప్ప ఇతరులెవరికీ కనపడదన్న వరం గల చంద్రమతి, ఆ కాటికాపరే తన భర్త హరిశ్చంద్రుడని గుర్తించింది. ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకుని దుఃఖపడ్డారు. సత్యధర్మాచరణలో భర్త అడుగుజాడల్లో నడిచే చంద్రమతి మంగళసూత్రాలు అమ్మి డబ్బు తెచ్చేందుకు నగరానికి వెళ్లింది. అర్ధరాత్రివేళ వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను భటులు రాజుగారి దగ్గరకు తీసుకు వెళితే ఆయన ముందు వెనకలు ఆలోచించకుండా ఉరిశిక్ష విధించాడు. భటులు ఆమె తలను నరికేందుకు తలారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తలారి ఎవరో కాదు, హరిశ్చంద్రుడే! విధినిర్వహణలో భాగంగా కత్తి తీసి ఆమె మెడ మీద పెట్టాడు హరిశ్చంద్రుడు. అది పూలమాల అయింది. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై అతని సత్యనిష్ఠను కొనియాడారు. హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడించలేకపోయానని ఒప్పుకుని అతని రాజ్యం అతనికి అప్పగించి ఆశీర్వదించి వెళ్లిపోయాడు విశ్వామిత్రుడు. మాటకు ప్రాణం సత్యమే. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడే గొప్పవాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
పాత్రోచిత దానం
ఒక మహారాజు తన రాజ్యంలో పెద్ద ఎత్తున తోట కూర పండించి అందరికీ దానం చేస్తుంటాడు. పెద్దలు, పండితులకు స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, ‘అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది?’ అని ప్రశ్న వేసేవాడు. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. దాంతో రాజు నిరాశ పడేవాడు. కొంతకాలం తర్వాత ఒక పండితుడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టను ఇస్తూ ఇదే ప్రశ్న వేశాడు. దానికాయన, ‘‘అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే!’’ అన్నాడు. రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికాయన చిర్నవ్వుతో ఇలా చెప్పేడు. ‘‘రాజా నీవు పూర్వ జన్మలో ఒక నిరుపేదవి. అదృష్టం కొద్దీ కొద్దిపాటి పెరడున్న ఒక పూరిల్లు ఉండేది. ఆ పెరటిలోనే తోటకూర పండించి, అందరికీ దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగానే ఈ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల, ఆ విషయాలన్నీ గుర్తున్నాయి. అప్పుడు కొద్దో గొప్పో తోటకూర దానం చేస్తే రాజునయి పుట్టేను కాబట్టి, ఇప్పుడు కూడా విరివిగా తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచిజన్మ లభిస్తుందన్నది నీ ఆలోచన. అంతేనా?’’ అని అడిగాడు. అందుకు రాజు నిజమేనని అంగీకరిస్తూ, ‘‘అప్పుడు తోటకూర దానం చేస్తే రాజుగా పుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇంతంత తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదు?’’ అని అడిగాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! అప్పుడు నీవొక నిరుపేదవి అయినప్పటికీ, ఉన్నదానిలోనే ఇతరులకు సాయపడాలన్న సంకల్పంతో తోటకూర దానం చేసేవాడివి. ఫలితంగా ఈ జన్మలో మహారాజుగా çపుట్టావు. అయితే నీకు స్తోమత ఉండి కూడా ఇంతకంటె మంచి జన్మ కావాలన్న కోరికతో నీ స్థాయికి తగ్గట్టుగా ధనం, వెండి, బంగారం వంటివి దానం చేయకుండా, పిసినిగొట్టుతనంతో తోటకూర మాత్రమే దానం చేస్తున్నావు. దీని ఫలితంగా నీవు మరుజన్మలో యాయవారం చేసుకుని జీవించాల్సి వస్తుంది జాగ్రత్త’’ అన్నాడు. ఆ మాటలకు రాజు సిగ్గుపడి, ఆయన కాళ్ళు పట్టుకుని తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. అందుకు ఆ పండితుడు ‘‘రాజా! నీవు ఇకనుంచి నీ తాహతుకు తగిన దానం చెయ్యి. ప్రజల మంచి చెడ్డలను తెలుసుకుని అవసరంలో ఉన్న వారిని ఆదుకో. ఏది చేసినా నిండు మనస్సుతో చెయ్యి. నిరుపేదల ఆకలి తీర్చు. అన్నింటికీ మించి పేదలు, వికలాంగులు, వృద్ధులు ప్రజలు ఇతరుల మీద ఆధారపడి జీవించే బాధ లేకుండా స్వయంగా సంపాదించుకునే ఏర్పాటు చెయ్యి. మంచి జ్ఞానాన్నిచ్చే విద్యాదానం, నిరుపేదలు జబ్బుతో ఇబ్బంది పడకుండా వైద్యశాలలు కట్టించి ఉచిత వైద్య దానం చెయ్యి. అందరినీ ఆదరించు’’ అని చెప్పాడు.రాజు అప్పటినుంచి పనికి మాలిన దానాలు మానేసి, ప్రజల్ని పాలించడం పైనే దృష్టి పెట్టాడు. ఇందులోని నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, తమ స్థోమతకు తగిన దానం చేయాలి. నిస్వార్థ బుద్ధితో చేసే దానం మాత్రమే భగవంతుడిని చేరుతుంది. స్థోమతకు మించిన దానాలు, అపాత్ర దానాల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
చక్రవర్తి సల్లంగుండాలె!
సాక్షి, హైదరాబాద్ : నిజాం పాలన అనగానే నిరంకుశత్వం కనిపించేది.. ఆ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు ఎదురు చూసినట్లు తెలంగాణ పల్లెలు కథలుకథలుగా చెబుతాయి. కానీ అంతకుపూర్వం కుతుబ్ షాహీ జమానాకు ముందు పాలించిన కాకతీయుల కాలం దీనికి భిన్నం. చక్రవర్తి ఎవరైనా, పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరిసింది. ఫలితం.. ప్రజలు కూడా పాలకులు చల్లగా ఉండాలని దీవించేవారు. ఇంట్లో శుభకార్యం జరిగినా, అశుభం అనంతరం చేసే కార్యక్రమాల్లోనైనా పాలకుల క్షేమాన్ని ప్రత్యేకంగా కాంక్షించేవారు. దీన్ని స్పష్టం చేస్తూ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో ఆదివారం ఓ శాసనం బయటపడింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు రాగి మురళి గుర్తించగా, బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ వివరాలు వెల్లడించారు. కొడుకు చనిపోయినా.. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో ప్రస్తుత నల్లగొండ ప్రాం తాన్ని మహాప్రధాన రాయబొల్లయ్య పర్యవేక్షించారు. అంటే ఆయన స్థానిక పాలకుడన్నమాట. ఇక్కడ ప్రాంతీయ వ్యవహారాలు పర్యవేక్షించే చంగల్‌దేవుడి కుమారుడు గణపయ్య మృతి చెందడంతో కొడుకు పేరిట స్థానిక గణాధీశ్వర (గణపతి) దేవాలయానికి ఆయన దశబంధబలి ప్రకటించారు. అంటే.. చెరువు కింద తనకున్న భూమిలో పదో వంతు మాన్యం దానంగా ఇచ్చాడు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, నైవేద్యం, ఇతర భోగాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ సమయంలో ఆయన శాసనం వేయించారు. శైవ సంప్రదాయం అనుసరించేవారు ఇలాంటి మరణానంతర కార్యక్రమాలపై ఏర్పాటు చేయించే శాసనంపై నంది శిల్పం చెక్కించేవారు. ఈ శాసనం కూడా ఆ పద్ధతిలో ఉంది. దాన వివరాలు పొందుపరిచిన తర్వాత గణపతి దేవ చక్రవర్తి పుణ్యంగా ఉండాలని అం దులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. శాసనంలో ఏముందంటే.. రాజవంశం: కాకతీయ రాజు: గణపతిదేవ చక్రవర్తి కాలం: శాలివాహన శక సంవత్సరం 1,168 (క్రీ.శ.1,246), పరాభవ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి వడ్డెవారం (శనివారం) అని ప్రారంభించారు. తెలుగు లిపిలో మొత్తం 39 పంక్తుల్లో శిలకు మూడు వైపులా అక్షరాలు చెక్కించారు. గతంలోనూ ఈ తరహాలో.. చక్రవర్తి పేరును ప్రస్తావిస్తూ సామాన్యులు చెక్కించిన శాసనాలు వెలుగు చూశాయి. తాజా శాసనం నాటి పాలకుల పట్ల ప్రజల అభిమానాన్ని స్పష్టం చేస్తోంది. సాధారణంగా పెద్దలు చనిపోతే పిల్లలు శాసనాలు వేయించిన దాఖలాలు వెలుగు చూడగా, కొడుకు పేరిట తండ్రి వేయించిన శాసనం వెలుగులోకి రావడం అరుదని హరగోపాల్ పేర్కొన్నారు. శాసనం సమీపంలో బాలసుబ్రహ్మణ్య స్వామి, భైరవుడు, గణపతి, ఆంజనేయుడు, లింగం లేని పానవట్టం ఉన్నాయి. ఇవి అప్పట్లో ఇక్కడున్న దేవాలయం ఆనవాళ్లు అయి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
శంభల! అద్భుతమా..? అపోహా..?
హిమాలయాల్లో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తీ పూర్తిగా సందర్శించలేదనేది వాస్తవం. అక్కడ 'యతి' రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించేవారూ ఉన్నారు. కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్యప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది. దాని పేరే 'శంభల' దీన్నే పాశ్చాత్యులు 'హిడెన్ సిటీ' అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు.. కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ శంభల ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢచిత్తులై ఉండాలని, ఎవరికి పడితే వారికి ఇది కనిపించదని.. ఎందుకంటే శంభల అతి పవిత్రమైన ప్రదేశమనీ చాలా మంది విశ్వసిస్తారు. భౌద్ధగ్రంథాల ప్రకారం.. బౌద్ధ గ్రంథాల్లో రాసి ఉన్న దాని ప్రకారం ఇది చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారు. వీరి ఆయుఃప్రమాణం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుంది. వారు మహిమాన్వితులు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పటి నుంచి మరో కొత్త శకం ప్రారంభం అవుతుంది. ఆ కాలం 2424లో వస్తుంది. రష్యా పరిశోధనలు.. 1920లో శంభల రహస్యాన్ని ఛేదించడానికి రష్యా తన ప్రత్యేక మిలటరీ బలగాలను పంపి పరిశోధనలు చేయించింది. ఈ పరిశోధనలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అక్కడ ఉండే యోగులు దాని పవిత్రత గురించి వివరించారు. హిట్లర్ ప్రయత్నాలు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంభల అధ్యయనానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని.. దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్‌కు చెప్పాడు. అనేక గ్రంథాల్లో.. గోబి ఎడారికి దగ్గరిలో ఉన్న శంభల రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రం అవుతుందని బుద్ధుడు 'కాలచక్ర'లో రాశారు. ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే ఆమె 101 ఏళ్లు బతికారని చెబుతారు. ఎక్కడ ఉంది..? సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసించే కైలాస పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉందనీ.. ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసనలతో నిండి ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. మరిన్ని విశేషాలు.. పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 అడుగుల పొడవు ఉంటారు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడి ఉంది. ఈ ప్రయాణంలో తొలుత ఎడారి వస్తుంది. అదే గోబి ఎడారి. పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది కున్లున్ పర్వత శ్రేణులతో కలిసి ఉండొచ్చు. ఆధ్యాత్మి క ధోరణి లేనివారికి ఈ నగరం కనిపించదని చెబుతుంటారు. పాశ్చాత్యులు ఈ నగరాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్, ది ఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్.. అనే పేర్లతో పిలుస్తారు.