Anasuya Bharadwaj Father Sudarshan Rao Passed Away: జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన రావు (63) అనారోగ్యంతో కన్నుమూశారు. తార్నాకలోని తన సొంత ఇంట్లో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కొద్ది నిముషాల్లోనే ప్రాణాలు విడిచినట్టు సమాచారం.
సుదర్శన రావు గతంలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన హఠాన్మరణంతో అనసూయ, ఆమె తల్లి, తోబుట్టువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సుదర్శన రావు కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు, అనసూయ అభిమానులు సంతాపం ప్రకటించారు.
(చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య.. అసలు కారణాలు ఇవేనా?)
Comments
Please login to add a commentAdd a comment