
రంగస్థలంలో అనసూయ లుక్
సాక్షి, సినిమా : రంగస్థలం ప్రీ రీలీజ్ ఈవెంట్‌లో తన పాత్ర గురించి యాంకర్ అనసూయ ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. అసలు తనకు ఆ పాత్ర చేయటం అస్సలు ఇష్టం లేదని.. కానీ, సుకుమార్ బలవంతం మేరకు తాను ఆ పాత్ర చేశానని, ఆ తర్వాతే ఆ పాత్ర విలువేంటో తెలిసి ట్రావెల్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే అంతలా ఆ పాత్రలో ఏం స్పెషాలిటీ ఉందా? అన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రంగమత్త పాత్రకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటిదాకా క్లాస్, గ్లామర్ రోల్‌ల్లో కనిపించిన అనసూయ.. ఇందులో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమౌతోంది.
సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ప్రతీ చిన్న పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ లెక్కన్న రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందనే.. అందుకే అనసూయ ఓకే చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్, సమంత లుక్కులు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నప్పటికీ అనసూయ పాత్ర విషయంలోనే చిన్నపాటి సస్పెన్స్ మెయింటెన్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment