
నింద నిజమైతే తప్పక దిద్దుకో..: అనసూయ
సాక్షి, హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగస్థలం 1985'. ఈచిత్రంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో మెప్పించిన బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈచిత్ర షూటింగ్‌లో ఇటీవలే చేరింది.
చరణ్ అభిమానులను సంతోష పరచడానికి సినిమాకు సంబంధించిన ఒక ఫొటోను అనసూయ సోషల్ మీడియా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అందులో గజ్జెలతో ఉన్న మహిళ పాదాలు.. కాలి వేలికి మెట్టెలు ఉన్నాయి. ఆమెకు ఎదరుగా చిన్న మట్టికుండ కూడా ఉంది. ‘నింద నిజమైతే తప్పక దిద్దుకో. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది.
1985 కాలంనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సుమారు రూ. 5 కోట్లతో పల్లెటూరు సెట్ కూడా వేశారు. ఇందులో రామ్‌చరణ్, సమంత ప్రత్యేకమైన వేషధారణలో కనిపించబోతున్నారని సమాచారం. 2018 సంక్రాంతికి 'రంగస్థలం' లో నిలపడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.
నింద నిజమైతే తప్పక దిద్దుకో
— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 4, 2017
అబద్ధమైతే నవ్వేసి వూరుకో..#Rangasthalam1985 @MythriOfficial 🙏🏻❤️ pic.twitter.com/wME9BzsP4x