సచ్చింది రా గొర్రె అంటున్న అనసూయ
సాక్షి, సినిమా: చాలా గ్యాప్‌తో సెలక్టివ్ సినిమాలు చేసుకుంటూ పోతున్న యాంకర్ కమ్ నటి అనసూయ మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. సచ్చింది రా గొర్రె పేరుతో తెలుగులో తెరకెక్కతున్న ఓ చిత్రంలో లీడ్ రోల్ కోసం అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా అనసూయే ప్రకటించింది.
‘ఎన్ని పాత్రలు చేసినా గొప్ప కథలో భాగస్వామిగా మారటమే నాకు ఇష్టం. తెలంగాణకు చెందిన నేను ఒగ్గు కథ స్టైల్ నేరేషన్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో నటించటం ఆనందంగా ఉంది. పూర్తిగా కామెడీతో కూడిన పాత్రను చేయబోతున్నా’ అంటూ అనసూయ వివరించింది. శ్రీనివాసరెడ్డి, రవిబాబు, టిల్లూ వేణు, రాకేష్, శివారెడ్డి, సత్యవతి, కోట శంకర్రావు ముఖ్యతారాగణంగా రూపొందుతోంది.
సోహం రాక్‌స్టార్, ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తుండగా.. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హెడ్‌గా వ్యవహ రించిన శ్రీధర్ రెడ్డి యార్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ కామెడీ జోనర్ లో రాబోతున్న సచ్చింది రా గొర్రె డిసెంబర్‌లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.