Anchor Anasuya Files Complaint To Cybercrime Police About Online Abuse, Details Inside - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన అనసూయ..ఇదిగో స్క్రీన్‌షాట్‌

Published Tue, Aug 30 2022 10:23 AM | Last Updated on Tue, Aug 30 2022 12:15 PM

Anchor Anasuya Bharadwaj Files Complanit To Cybercrime Police About Online Abuse - Sakshi

బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గానూ అలరిస్తున్నారు అనసూయ. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో అనసూయను ఆంటీ అంటూ టార్గెట్‌ చేస్తూ కొందరు నెటిజన్లు ఆమెపై అసభ్యకర రీతిలో కామెంట్స్‌ చేస్తూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మండిపడ్డ యాంకర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని నెటిజన్లు ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేశారు.

తాజాగా తనను ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై అనసూయ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైంది. అప్‌డేట్స్‌  ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది’ అంటూ కంప్లైట్‌ తాలుకూ స్క్రీన్‌షాట్‌ని షేర్‌ చేసింది. 

కాగా 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ, రావడం మాత్రం పక్కా!' అని అంటూ ఈనెల 25న అనసూయ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించే పెట్టిందని అభిప్రాయపడ్డ అతడి అభిమానులు ఆంటీ అంటూ అనసూయను దూషించారు. వేలకొద్ది మీమ్స్‌, ట్వీట్స్‌ చేస్తూ ఆంటీ పదాన్ని ట్రెండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement