
యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. రీసెంట్‌గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అటు బుల్లితెర షోస్‌తో పాటు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలోనూ అనసూయ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేసింది. 'ట్రోలర్, మీమర్స్ ఈరోజు మహిళల దినోత్సవం అని గుర్తొచ్చి హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభిస్తారు. అయినా ఈ గౌరవం ఎలాగో 24 గంటల్లో ముగుస్తుందనుకోండి. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే' అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొందరేమో ప్రతీసారి కాంట్రవర్సీయేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022