నేను అదే మొత్తుకుంటున్నా.. నిజ జీవితంలో అలా కాదు అని! | Anasuya Bharadwaj: We Play Characters, We are not Bad For Real | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: షారుక్‌ చెప్పిందే నిజం.. అది ఇది ఒకటి కాదు..!

Published Fri, Feb 3 2023 11:46 AM | Last Updated on Fri, Feb 3 2023 12:25 PM

Anasuya Bharadwaj: We Play Characters, We are not Bad For Real - Sakshi

ఈ వీడియోను అనసూయ షేర్‌ చేస్తూ 'ఎప్పటినుంచో నేనూ అదే చెప్తున్నా.. మేము ప్రతికూల పాత్రల్లో నటిస్తామే తప్ప రియల్‌ లైఫ్‌లో అలా ఉండము' అని రాసుకొచ్చింది.

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా రాణిస్తోంది అనసూయ భరద్వాజ్‌. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తోంది. అయితే ఆమధ్య అనసూయ ఆంటీ వివాదంలో చిక్కుక్కున్న విషయం తెలిసిందే! వీలైనంతవరకు తనను విమర్శించినవారికి గట్టి సమాధానం ఇస్తూ పోయింది అనసూయ. ఇకపోతే కథ నచ్చితే ఎలాంటి పాత్రయినా చేస్తుందీ యాంకర్‌. లేడీ విలన్‌ టైప్‌ క్యారెక్టర్లను కూడా అవలీలగా నటించేస్తుంది. అయితే ఆ పాత్రను చూసి తమ క్యారెక్టర్లు డిసైడ్‌ చేయకండంటూ షారుక్‌ మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది అనసూయ.

అందులో పఠాన్‌ హీరో షారుక్‌ మాట్లాడుతూ.. 'డర్‌, బాజీగర్‌లో నేను నెగెటివ్‌ రోల్స్‌ చేశాను. జాన్‌ అబ్రహం కూడా చాలా నెగెటివ్‌ రోల్స్‌ చేశాడు. అలా అని మేమంతా చెడ్డవాళ్లం కాదు. కేవలం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికే ఆయా పాత్రలు పోషిస్తాము' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను అనసూయ షేర్‌ చేస్తూ 'ఎప్పటినుంచో నేనూ అదే చెప్తున్నా.. మేము ప్రతికూల పాత్రల్లో నటిస్తామే తప్ప రియల్‌ లైఫ్‌లో అలా ఉండము' అని రాసుకొచ్చింది.

చదవండి: కోలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అయిన జాన్వీ కపూర్‌ 
కె.విశ్వనాథ్‌ చివరి క్షణాల్లో జరిగిందిదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement