
యాంకరింగ్‌తోనే గుర్తింపు
= శ్రీశైలంలో సినీనటి అనసూయ
శ్రీశైలం: సినిమాలు, సీరియల్స్‌లో నటించినా యాంకరింగ్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయ్యానని సినీనటి అనసూయ తెలిపారు. మల్లన్న దర్శనార్థం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శనివారం శ్రీశైలం వచ్చారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జబర్దస్త్త్ తనకు టీవీ యాంకర్‌గా బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. కొన్ని మంచి సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయని, అయితే టీవీ యాంకరింగ్‌తోనే ఇరు రాష్ట్రాల్లోని అభిమానులకు చేరువైనట్లు తెలిపారు. శ్రీశైలానికి అనసూయ వచ్చినట్లు తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఉత్సహం కనబరిచారు. ఆలయం బయట కొందరు ఆమెను కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. దర్శనం ఆమె అనంతరం హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.