
టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. రంగస్థలం మూవీలో ఆమె పోషించిన రంగమ్మత్ర పాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే క్రేజ్ ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
చదవండి: మహేశ్ సినిమాకు హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నా: రాజమౌళి
దీంతో ఆమె వెండితెరపై నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో చిన్న సినిమాలు, భారీ బడ్జెట్‌లో చిత్రాలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌లో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెకు మరోసారి జబర్దస్త్ షో వీడటంపై ప్రశ్న ఎదురైందట. ఇక దీనికి ఆమె స్పందిస్తూ ఈ షో నుంచి బయటకు రావడానికి రకరక కారణాలున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. అందులో తన పిల్లలు కూడా ఉన్నారని ఆమె పేర్కొందట.
చదవండి: అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
ప్రస్తుతం నటిగా తాను ఫుల్ బిజీగా ఉన్నానని, ఇటూ షూటింగ్, అటూ షోలు చేస్తు ఇంట్లో పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే జబర్దస్త్ మానేయాల్సి వచ్చిందని అనసూయ పేర్కొంది. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలతో పాటు గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా తెరెకెక్కితోన్న కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. అలాగే సందీప్ కిషన్ తాజా చిత్రం మైఖేల్‌లో కూడా ఓ కీలక పాత్ర చేసింది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment