
రంగస్థలం చిత్రంలో రంగమ్మ అత్తగా అలరించిన నటి అనసూయ శనివారం బెజవాడలో సందడి చేశారు. గురునానక్‌కాలనీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనసూయ మాట్లాడుతూ రంగస్థలంలో రంగమ్మ పాత్ర తనకు ఎంతోపేరు తీసుకువచ్చిందన్నారు. ఎప్పుడూ ఆనందంగా ఉండడమే తన అందం రహస్యమన్నారు. హీరో శ్రీనివాస రెడ్డితో తాను చేసిన చిత్రం త్వరలో విడుదల కానుందని పేర్కొన్నారు.
– సాక్షి, గుణదల