Private program
-
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
రాజధానిలో రంగమ్మత్త
రంగస్థలం చిత్రంలో రంగమ్మ అత్తగా అలరించిన నటి అనసూయ శనివారం బెజవాడలో సందడి చేశారు. గురునానక్‌కాలనీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనసూయ మాట్లాడుతూ రంగస్థలంలో రంగమ్మ పాత్ర తనకు ఎంతోపేరు తీసుకువచ్చిందన్నారు. ఎప్పుడూ ఆనందంగా ఉండడమే తన అందం రహస్యమన్నారు. హీరో శ్రీనివాస రెడ్డితో తాను చేసిన చిత్రం త్వరలో విడుదల కానుందని పేర్కొన్నారు. – సాక్షి, గుణదల -
‘అదే భారత్ విలక్షణత’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పేదరికంలో మగ్గే ప్రజలు సైతం సంతోషంగా నవ్వగలగడం తనను అబ్బురపరిచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ అన్నారు. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ భారత్‌లో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. దేశంలోని పలు నగరాల్లో చేపట్టిన ట్రంప్ టవర్స్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతారు. జూనియర్ ట్రంప్ భారత్ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనని, ప్రైవేట్ సిటిజన్‌గా పర్యటన కొనసాగిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హెతర్ నౌర్ట్ చెప్పారు. ఎలాంటి అధికారిక హోదాలో ట్రంప్ పర్యటించడంలేదని స్పష్టం చేశారు. భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు జూనియర్ ట్రంప్ హాజరవనున్నారు. మరోవైపు దేశరాజధానిలోని ఓ స్టార్ హోటల్లో ట్రంప్ రియల్ఎస్టేట్ డెవలపర్లతో భేటీ అయ్యారు. కోల్‌కతా, ముంబయి, పూణే, గుర్గావ్ తదితర నగరాల్లోనూ భారత ఇన్వెస్టర్లు, బిజినెస్ లీడర్లతో ఆయన సమావేశమవుతారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
ఆదిలోనే అవకాశాలు రావడం అదృష్టం
టీవీ, సినీ నటి ఝాన్సీ రాజమండ్రి కల్చరల్ :టీవీ ప్రసారాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే తనకు అవకాశాలు వచ్చాయని, అది తన అదృష్టమని ప్రముఖ టీవీ యాంకర్, సినీనటి ఝాన్సీ తెలిపారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి రాజమండ్రి వచ్చిన ఆమె తన టీవీ, సినీ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. రాణించడానికి కారణం టీవీ ప్రసారాల ప్రారంభ దశలోనే నాకు అవకాశాలు రావడంతో అన్ని రకాల యాసలు అలవాటయ్యాయి. విభిన్న పాత్రలు లభించాయి. చాలామంది ప్రేక్షకులు నన్ను కలిసినప్పుడు నా నటన యాంత్రికంగా ఉండదని, బుల్లితెరపై నన్ను చూస్తుంటే కుటుంబ సభ్యురాలిని చూసినట్టే ఉంటుందని చెబుతుంటారు. దానికి కారణం తొలితరం నటిని కావడమే. చదువూసంధ్యా నేను మాస్టర్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను. అలాగే మెడికల్ లాలో డిప్లొమా కూడా చేశాను. నేటి సినిమాల తీరుతెన్నులు ఈ మధ్య విడుదలవుతున్న చిన్న సినిమాలు చాలా బాగుంటున్నాయి. చిన్న సినిమా కొత్త ఆలోచనలకు వేదికగా మారింది. దర్శకుడి సృజనాత్మకత, ప్రతిభ అన్నీ చిన్న సినిమాల్లో వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమకు పెద్ద సినిమా ఎంత ముఖ్యమో, చిన్న సినిమా కూడా నా దృష్టిలో అంతే ముఖ్యం. నా సినిమాల గురించి ఎన్ని సినిమాల్లో చేశానో లెక్కపెట్టుకోలేదు. సుమారు 50 సినిమాలు చేసి ఉండొచ్చు. అభిమాన హీరో ఎవరంటే చెప్పడం కష్టం. అక్కినేని నాగార్జున, జగపతిబాబుల నటనంటే ఇష్టపడతాను. సాక్షితో అనుబంధం సాక్షితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో వచ్చే సిటీ ప్లస్‌లో ‘ఝాన్సీ కీ రాణి’ పేరిట ఓ ఫీచర్ చేస్తున్నా. -
నేను పిరికిదాన్ని కాను
‘‘ముంబైలో స్వయంగా నా ఇంట్లోనే ఓ అగంతకుడు నాపై ఎటాక్ చేశాడు. ఆ క్షణంలో నేను కొంత భీతిల్లిన మాట నిజమే. కానీ.. నేను పిరికిదాన్ని కాను. అందుకే.. ప్రతిఘటించగలిగాను’’ అంటూ తనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు శ్రుతిహాసన్. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మహిళలపై సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై శ్రుతి స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘మనదేశంలో మహిళలకు నిజంగా రక్షణ తక్కువే. నాకు జరిగిన ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలామందికి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉంటే... ఆడకూతుళ్లపై జరుగుతున్న దారుణాలను తేలిగ్గా అరికట్టవచ్చు’’ అని ఆవేశంగా చెప్పారు. -
‘మనం’లో నటించడం నాకో వరం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: అక్కినేని వంశంలోని మూడు తరాల నటులతో తీస్తున్న మనం సినిమాలో తాను కూడా నటించడం ఓ వరంగా భావిస్తున్నానని ప్రముఖ హీరోయిన్ శ్రీయ అన్నారు. సినిమాల్లో నటించడంతోపాటు పేదలకు సేవ చేయడంలో మరింత తృప్తి కలుగుతుందని చెప్పారు. ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మంచి సినిమాల కోసం.... ఈ మధ్య సినిమాలు తక్కువగా ఒప్పుకుంటున్నాను. చాలా మంది కథలతో వస్తున్నారు. కానీ నేను ఆచితూచి అడుగు వేస్తున్నాను. మంచి కథ దొరికితేనే ఒప్పుకుంటున్నాను. అందుకే ఇటీవల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, పవిత్ర మాత్రమే చేశాను. ఆశించినంత విజయం దక్కలేదు పవిత్ర సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. అది చాలా మంచి సినిమా. సందేశాత్మకమైన చిత్రం. కానీ ఆశించిన విజయం దక్కలేదు. ఏఎన్ఆర్తో నటించడం అదృష్టం ‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో నటించడం అదృష్టం. నా కెరీర్లో ఇది మరిచిపోలేని చిత్రంగా భావిస్తున్నా. నటిగానే కాకుండా ఓ ప్రేక్షకురాలిగా కూడా ఈ సినిమాను ఎప్పుడు తెరపై చూద్దామా అని తహతహలాడుతున్నాను. యోగా టిప్స్ నేర్చుకుంటున్నా... నాకు సంతోషం సినిమాలో అక్కినేని అమలతో మంచి పరిచయం ఏర్పడింది. ఆమె చాలా మంచి వ్యక్తి. తన వద్ద నేను విపాసన యోగ టిప్స్ నేర్చుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు స్త్రీ స్పందన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. దీని ద్వారా అంధులకు సేవ చేస్తున్నాను. వివిధ దేశాల్లో ప్రభుత్వం అంధులకు, వికలాంగులకు ఎంతో సేవ చేస్తోంది. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. వీధి బాలలపై ఆర్ట్ ఫిల్మ్ ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు దీప మెహతా దర్శకత్వంలో నేను వీధి బాలల కోసం ఓ ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అందులో నా పాత్ర పేరు పార్వతి. ‘మిడ్నైట్ చిల్డ్రన్’ అనే పేరుతో ఈ ఆర్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. విశాఖ నాకు చాలా ఇష్టం నాకు విశాఖ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లకు, క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా విశాఖ కొత్తగానే ఉంటుంది. సహజసిద్ధమైన అందంతో కొత్తగానే దర్శనమిస్తుంది. ఇక్కడ బీచ్ నాకు చాలా ఇష్టం.