![Kerala IAS officer Divya S Iyer holds son in arms while delivering speech - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/COLLECTOR1.jpg.webp?itok=CZ8gm4a4)
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు.
మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment