speeches for Program
-
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
21న దేశవ్యాప్తంగా మమత ప్రసంగం ప్రసారం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికార పీఠమెక్కిన టీఎంసీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఏటా జూలై 21న జరిగే అమరవీరుల దినోత్సవం రోజు సీఎం మమతా బెనర్జీ ప్రసంగం బెంగాల్‌తోపాటు వివిధ రాష్రాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. బెంగాల్‌తోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, త్రిపురల్లో ఏర్పాటయ్యే భారీ స్క్రీన్లపై ఈ ప్రసంగాన్ని ప్రసారం చేయనుంది. అమరవీరుల దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ వర్చువల్‌గా బెంగాలీలో చేసే ప్రసంగం వివిధ భారతీయ భాషల్లోకి అనువదించి, ప్రసారం చేస్తామని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. 21న దీదీ ప్రసంగాన్ని ప్రజలంతా చూసేలా గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ స్క్రీన్ టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రం తమిళనాడుపై కన్నేసిన టీఎంసీ.. దివంగత జయలలిత మాదిరి గా, మమతా బెనర్జీని ‘అమ్మ’గా పేర్కొంటూ ఇప్పటికే చెన్నైలో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. 1993లో ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిమాండ్‌తో అప్పటి యూత్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు. ఆ ఘటన చోటుచేసుకున్న జూలై 21ని అమరవీరుల దినంగా టీఎంసీ పాటిస్తోంది. -
10, 11 తేదీల్లో కడప జిల్లాలో డా. ఖాదర్ వలి సభలు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార, అటవీ వ్యవసాయ నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 10, 11 తేదీల్లో డా. వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. పులివెందుల: 10 (ఆదివారం) ఉ. 10 గంటలకు పులివెందులలో సరస్వతి విద్యా మందిరం (పార్నపల్లి రోడ్డు)లో ఆధునిక రోగాలు – దేశీయ ఆహారంతో నియంత్రణ, నిర్మూలన అనే అంశంపై డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 94411 05405, 94409 72504. కడప: 10 (ఆదివారం) సా. 4.30 గం.కు కడపలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల కందుల ఎస్టేట్‌లో సీబీఐటీ కాలేజీ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. మహిళలకు ప్రత్యేక ఆహ్వానం. వివరాలకు.. 96408 08099, 96660 71719. తాడిపత్రి: 11 (సోమవారం) ఉ. 9.30 గంటలకు తాడిపత్రిలోని శ్రీ కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ (శ్రీనివాసపురం, దివాకర్ పెట్రోల్ బంకు వెనుక)లో స్పర్శ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 98387, 96766 35193. ప్రొద్దుటూరు : 11 (సోమవారం) సా. 4.30 గంటలకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్)లో సీబీఐటీ కాలేజీ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 96408 08099, 96660 71719. పత్తి పంట ఉంటే, వెంటనే పీకెయ్యండి! అవును. మీరు సరిగ్గానే చదివారు.. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పత్తి వేసిన రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(íపీజేటీఎస్ఏయూ) ద్వారా డిసెంబర్ నెలాఖరుకు పత్తి పంటను తీసివేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా ఇప్పటికీ, నీటి వసతి కింద పత్తిని వేసిన రైతులు పంటను కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆశించిన ఎర్ర గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగి రాబోయే ఖరీఫ్ పంటకాలంలో ఎక్కువ నష్టం కలిగించే ఆస్కారం ఉంది. కాబట్టి రైతాంగమంతా ఫిబ్రవరి మొదటి వారానికి తప్పనిసరిగా పత్తి పంటను తీసివేసి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పీజేటీఎస్ఏయూ విస్తరణ సంచాలకులు కోరారు. ఫిబ్రవరి నుంచి మే వరకు తెలంగాణలోని ఏ ప్రాంతంలోనూ పత్తి పంట లేకుండా చూసుకోవడం ద్వారా అంటే.. క్రాప్ హాలిడే ప్రకటించడం ద్వారా గులాబీ రంగు పురుగు రాబోయే ఖరీఫ్ పంటకు రాకుండా నివారించుకోవచ్చని సూచించారు. 10న సిరిధాన్యాల సాగు, మిక్సీతో మరపట్టడంపై శిక్షణ ఈనెల 10 (ఆదివారం)న ఉ. 10 గం.– సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో సిరిధాన్యాలు మిక్సీతో మరపట్టించడం, సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ శిక్షణ ఇవ్వనున్నారు. అటవీ చైతన్య ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 23న కరీంనగర్లో ఎన్.సి.ఓ.ఎఫ్. సేంద్రియ రైతు సమ్మేళనం కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయం కేంద్రం (ఎన్.సి.ఓ.ఎఫ్.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్ (కలెక్టరేట్ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. – సా. 5 గం. వరకు రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్ డీ కంపోజర్ టెక్నాలజీతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, పీజేఎస్ ఇండియా సర్టిఫికేషన్, సేంద్రియ మార్కెట్ అనుసంధానంపై సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఎన్.సి.ఓ.ఎఫ్. డైరెక్టర్ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. వూట్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాలకు.. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు సముద్రాల జనార్దన్‌రావు– 93969 69217, 84640 09350. మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా గోఆధారిత రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో మార్చి 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్లో సేంద్రియ ఉత్పత్తుల మేళా (ప్రదర్శన, అమ్మకాలు, అవగాహన సదస్సులు) జరగనుంది. 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటుంది. 2న మ. 3 గంటలకు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 3న మ. 3 గంటలకు జరిగే సేంద్రియ వ్యవసాయం–ఆరోగ్య అవగాహన సదస్సులో స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను ఉచితంగా అమ్ముకోవడానికి అనుమతి ఉంటుందని గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534. -
30 నుంచి కోస్తా జిల్లాల్లో డా. ఖాదర్ ప్రసంగాలు
అటవీ వ్యవసాయ, సిరిధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలీ(మైసూర్) ఈనెల 30, అక్టోబర్ 1,2 తేదీల్లో కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగు, సిరిధాన్యాలు – కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం– అన్ని రకాల వ్యాధులను నిర్మూలించే దేశీ ఆహార పద్ధతులపై ఆయన ప్రసంగిస్తారు. 30న ఉ. 10 గం.కు గుంటూరు (బాలాజీ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను), అదే రోజు సా. 4 గం.కు విజయవాడ (సిద్ధార్థ ఆర్ట్స్–సైన్స్ కళాశాల, మొగల్రాజపురం), అక్టోబర్ 1 ఉ. 10. గం.కు రాజమండ్రి (గేదెల నూకరాజు కల్యాణ మండపం, మెయిన్ రోడ్, ఎ.సి.గార్డెన్స్, రాజమండ్రి), అదేరోజు సా. 4 గం.కు కాకినాడ (అల్యూమ్ని ఆడిటోరియం హాల్, జె.ఎన్.టి.యు, కాకినాడ)లో డా. ఖాదర్ ప్రసంగి స్తారు. 2 (మంగళవారం)న సా. 3 గం.కు విశాఖ పట్నం(సిరిపురం జంక్షన్, హెచ్.పి. పెట్రోల్ బంకు ఎదురుగా) ఏయూ కాన్వకేషన్ హాల్లో ప్రసంగి స్తారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 70939 73999. -
ఓడిపోయిన సంస్కారం
క్లాసిక్ కథ సుందరమ్మకంతా కలలో వున్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం మొదలైవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లియే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమెకెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే చాలా సిగ్గుపడింది. పునర్వివాహానికి ఆమె మొదట తీవ్రంగా వ్యతిరేకించినా తన యిద్దరి అన్నగార్లూ యెడతెగకుండా చేసిన హితోపదేశాల వల్లా, విధవ ఐన ఈ రెండేండ్లలోనూ తాను గడించిన జీవితానుభవం వల్లా, ఆమె యీ రెండవ పెండ్లికి ఒప్పుకుంది. ఐనా ఒక సంవత్సరం పాటు భర్తతో కాపురం చేసిన తాను సిగ్గు పెండ్లికూతురుగా పదిమందిలోనూ ఎట్లా ప్రవర్తించడమూ అన్న భయసంకోచాలు ఆమె మనస్సును పీడిస్తూనే వుండినాయి. అందువల్ల ఈ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందని తెలిసినప్పుడు ఆమె సంతృప్తితో నిట్టూర్చింది. తీరా యిప్పుడు చూస్తే ఆ పాత ఆచారాల ఆర్భాటమే మేలనిపించేటట్లుంది ఈ కొత్త వ్యవహారమంతా. పెండ్లేమో పది నిముషాల్లోనే అయిపోయింది. వచ్చిన బంధువులంతా, పురోహితునితో గూడా కలిసి యిరవై మంది కంటే యెక్కువ లేరు. తనకు సిగ్గుపడాల్సిన ఘట్టాలేవీ లేకుండానే పెండ్లి ముగిసిందని ఆమె సంతోషిస్తూ వుండగానే - అంతలోనే ఉపన్యాసాల కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కరే లేచి పెండ్లికొడుకును అభినందించడం, అతని సంఘ సంస్కరణాభిలాషను పొగడడం, అతని ఔదార్యాన్ని మెచ్చుకోవడం, ఆఖరులో ఆశీర్వదించడం - ఆమెకంతా అయోమయంగా వుంది. సుమారు గంట నుండి ఉపన్యాసాలు సాగుతున్నాయి. ఇప్పటికి ఐదారు మంది మాట్లాడినారు. ఇంకా యెంత మంది మాట్లాడుతారో? విధవను పెండ్లి చేసుకోవడానికి యెవరైనా సిగ్గుపడతారని మాత్రమే ఆమెకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో అదేమీ తప్పుకాదనీ, అందువలననే విధవా వివాహాలు జరుగుతున్నాయనీ ఆమె అనుకుంది. కాని ఇందులో ప్రశంసించవలసిందేముందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఒక యువకుడు లేచి, అందరూ పెండ్లికొడుకైన రామనాథాన్ని మాత్రమే మెచ్చుకోవడం అన్యాయమనీ, సుందరమ్మ ధైర్య సాహసాలే యెక్కువగా మెచ్చుకోతగినవనీ ఉపన్యాసం మొదలుపెట్టినాడు. ఇదేదో మరీ విపరీతంగా కనపడిందామెకు. ఇందులో ధైర్య సాహసాలేమున్నాయి? జీవితమంతా సుఖపడాలనే ఆశతోనే తానీ పెండ్లికి సిద్ధపడింది. అందులో తన్ను అంత పెద్దగా పొగడవలసిందేముంది? యితరుల కోసం తాను చేసిందేమీ లేదే? ఆ ఉపన్యాసం అయిపోయినంత వరకూ ఆమెకు ముండ్లమీద కూర్చున్నట్లే వుంది. అదృష్టవశాత్తు అది ఐన వెంటనే కాఫీ ఫలహారాల కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత 20 నిముషాల్లోనే ఆమె భర్త గృహం చేరుకుంది. రాత్రి భోంచేసిన వెంటనే పడక గదిలో మంచం మీద కూర్చుంది సుందరమ్మ. భర్త యెటువంటివాడా అని ఆలోచించడానికి పూనుకుంది ఆమె. వెంటనే మూడేండ్లనాడు తనకు కార్యం అయిన నాటి పరిస్థితులకూ ఈనాటి పరిస్థితులకూ వున్న తేడా ఆమె మనసులో మెదిలింది. ఆనాడు తన పెద్ద వదినె తన్నెంతో ఆప్యాయంగా అలంకరించి, గదివరకూ తన్ను పిలుచుకొని వచ్చి వాకిలి దగ్గర వదిలిపెట్టిపోయింది. ఆనాడు భర్త తన కొరకు ఎదురుచూస్తూ వుండినాడు సిగ్గుతో, వుత్సాహంతో, ఉత్కంఠతో. తానానాడు పడక గదిలో ప్రవేశించింది. ఆనాడు వదినెల పరిహాసంతో తన సిగ్గు నూరంతలు పెరిగినా, యేదో అపూర్వమైన సౌఖ్యం. అనంతమైన ఆనందం తన కందబోతున్నదని అర్థంకాని ఉత్సాహం కూడా తన్నావేశించింది. ఈనాడు తనను అలంకరించేవాళ్లూ లేరు. పరిహసించేవాళ్లూ లేరు. ఆ సిగ్గూ లేదు, ఉత్సాహమూ లేదు. ఈనాడు తానేవచ్చి పడక గదిలో భర్త కొరకెదురుచూస్తూ కూర్చుంది. ఈనాడు తనకు కలగబోయే సుఖం యొక్క స్వరూపం తెలుసు. అందువలన ఆనాటి ఉత్కంఠ లేదు. ఆనాడు తన ఉద్దేశాలతో నిమిత్తం లేకుండా యితరులు తన్నొక సుఖసముద్రంలో త్రోసినారు. ఈనాడు తాను బుద్ధిపూర్వకంగా స్వప్రయత్నంతో ఆ సుఖ సముద్రాన్ని సమీపించింది. ఈ సుఖం తాను విధినెదిరించి సంపాదించుకున్న సుఖం. ఇది తన జన్మహక్కు. తన జన్మహక్కు కొరకు యెదురుచూడడంలో సిగ్గుపడవలసిందేమీ లేదు. తన హక్కు లభ్యమైనప్పుడు తానెవ్వరికీ కృతజ్ఞురాలు కానక్కరలేదు. ఈ రామనాథం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఔను - భర్త గుణగణాల మీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే... ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో! మొదట మంచివాళ్లగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినటం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో? తన బ్రతుకంతా యితని స్వభావ సంస్కారాల మీదనే యేర్పడుతుంది. సుందరమ్మకు యింకో విషయం జ్ఞాపకం వచ్చింది. మూడేండ్ల నాడు యిదే పరిస్థితిలో భర్త యెటువంటివాడు అన్న ప్రశ్న తనకు తట్టనేలేదు. ఆనాడు తనకు కలగబోయే సుఖాన్ని గురించే తాను ఊహించుకుంది. తన భవిష్యజ్జీవితాన్ని గురించే గాలి మేడలు కట్టుకుంది. ఆనాడు తన భర్త అందచందాలను గురించైనా కొంతవరకు తనలో తాను వితర్కించుకుంది గాని, అతని స్వభావ సంస్కా రాలను గురించిన ఆలోచనే తనకు రాలేదు. ఈ విషయం జ్ఞాపకం వచ్చి ఆమె ఆశ్చర్యపడింది. వెంటనే కారణం స్ఫురించి తనలో తాను నవ్వుకుంది. పురుషుల స్వభావ సంస్కారాలే స్త్రీ సుఖ సంతోషాలను నిర్దాక్షిణ్యంగా నిర్ణయిస్తాయని ఆనాడు తనకు తెలియదు. ఆనాడు తెలియనివి యీనాడు తనకెన్నో తెలుసు. ముఖ్యంగా స్త్రీలు సుఖపడడానికి పురుషుల ఆకారాల కంటె పురుషుల మనస్సులే ప్రధానం అన్న విషయం తనకు బాగా తెలుసు. అందుకే యీ పెండ్లి ఖాయమైనప్పటి నుండి ఈ ప్రశ్న యెడతెగకుండా తనకెదురౌతూనే వుంది. ఈ రామనాథం యెటువంటివాడు? ఇతని మనస్సు యెటువంటిది? వాకిలి దగ్గర చప్పుడౌతూనే ఆమె తలయెత్తి చూసింది. భర్త కనబడగానే లేచి నిలబడింది. ‘‘సుందరీ! పెండ్లిలో నీకేమీ కష్టం కలుగలేదు కదా?’’ అంటూ రామనాథం ఆమెను సమీపించి, మంచం మీద కూర్చొని, ఆమెను గూడా కూర్చోమన్నట్లు ఆమె భుజం మీద చేయి వేసి బరువుగా నొక్కినాడు. సుందరమ్మ అతని ప్రక్కనే కూర్చుంటూ - ‘‘లేదండీ’’ అన్నది. రామనాథం ఉత్సాహంగా అందుకున్నాడు: ‘‘ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చేయించినాను తెలుసా? నీ మనస్సుకేమీ ఆయాసం కలగకూడదని నేనెంత శ్రద్ధ తీసుకున్నాననుకున్నావ్?’’ ‘‘ఊ’’ అన్నది సుందరమ్మ నిరుత్సాహంగా. రామనాథం మరింత ఉత్సాహంగా అన్నాడు: ‘‘ఊ అనడం గాదు సుందరీ! నీ సుఖం కొరకు జీవితమంతా ధారపోయడానికి సిద్ధంగా వున్నానంటే నమ్ము. ఈ పెండ్లిని గురించి యెంతమంది బంధువులకు దూరమైనాననుకున్నావ్? అంతెందుకూ - రేపు పత్రికలో చూస్తావుగా నేను నీకొరకెంత త్యాగం చేసిందీ.’’ ఇంతవరకూ నేలకేసి చూస్తూ వున్న సుందరమ్మ తలయెత్తి రామనాథం ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో వంచన యెక్కడా కనబడలేదు. అతని కన్నుల నిండా ఆత్మసంతృప్తి తప్ప మరే భావమూ లేదు. ఆమె మెల్లగా అడిగింది: ‘‘నా కొరకు అంత త్యాగం చేయవలసిన పనేముంది మీకు?’’ అది ప్రశ్నగా కాక తన అభిప్రాయం చెప్పినట్లు శాంతంగా చెప్పబోయింది ఆమె. కానీ, మధ్యలో అప్రయత్నంగా కంఠం వణికి అది ప్రశ్నగా ధ్వనించింది. తనకు తెలియకుండానే తనలో కలిగిన ఆవేశానికి సిగ్గుపడి ఆమె మళ్లీ తలవంచుకుంది. రామనాథం యివన్నీ గమనించకుండానే వెంటనే జవాబు చెప్పినాడు. ‘‘అదేం మాట సుందరం? మానవులన్న తర్వాత ఆదర్శాల కొరకు త్యాగం చెయ్యకపోతే యెట్లా? నీబోటి యువతులందరూ నిష్కారణంగా జీవిత సౌఖ్యాలకు దూరమై ఉసూరుమంటుంటే మన సంఘం బాగుపడేదెట్లా?’’ సుందరమ్మ మౌనంగానే వుంది. అతని మనస్సును అర్థం చేసుకోడానికి ఆమె ప్రయత్నిస్తూ వుంది. ఈ మనిషికి నన్ను సుఖపెట్టాలని యింత తాపత్రయమెందుకో? తాను సుఖపడాలనే ఆశ యితనికే కోశానా లేదా? ఆమె ఆలోచనల్ని రామనాథం సాగనివ్వలేదు. రెండు చేతులతోనూ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని అతనన్నాడు: ‘‘యిటు చూడు సుందరం, యీ పెండ్లి కాకుండా వుంటే నీ జీవితమంతా యెట్లుంటుందో ఊహించుకున్నావా? నేను త్యాగం చెయ్యకపోతే నీ బ్రతుకులోని చీకటంతా తొలగిపొయ్యేదెట్లా?’’ అతని కన్నుల్లోకి చూస్తూ వున్న సుందరమ్మ కనురెప్పలు వాల్చి విచారంగా చిరునవ్వు నవ్వింది. రామనాథం ఆమె చిరునవ్వు మాత్రమే చూసినాడు. ఆ చిరునవ్వులోని విచారాన్ని గమనించే స్థితిలో లేడు అతను. ‘‘చూడు - యిప్పుడు నీ బ్రతుకంతా వెన్నెల అయింది. నా త్యాగమంతా నీ చిరునవ్వు రూపంలో ఫలించినందుకు నాకెంత ఆనందంగా వుందనుకున్నావ్’’ అని అన్నాడు సంతృప్తీ, సంతోషం నిండిన కంఠంతో. సుందరమ్మకు ఒక్కసారిగా భవిష్యత్తంతా అంధకారమయమైంది. ‘‘ఇంత త్యాగం జీవితమంతా మోసే శక్తి నాకు లేదు’’ అని బిగ్గరగా అరవాలనుకుంది. ఆమె దిగ్గున లేచి నిలబడింది. అంతలోనే తన అసహాయత మెరుపు వలె ఆమె మనసులో తోచింది. కండ్లు తుడుచుకుంటూ రామనాథం పాదాల దగ్గర నేలమీద కూర్చొని, ‘‘మీ త్యాగానికి తగిన యోగ్యత నాకు కలిగేటట్లు ఆశీర్వదించండి’’ అని గద్గద కంఠంతో పలికింది. - రాచమల్లు రామచంద్రారెడ్డి