సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార, అటవీ వ్యవసాయ నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 10, 11 తేదీల్లో డా. వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు.
పులివెందుల: 10 (ఆదివారం) ఉ. 10 గంటలకు పులివెందులలో సరస్వతి విద్యా మందిరం (పార్నపల్లి రోడ్డు)లో ఆధునిక రోగాలు – దేశీయ ఆహారంతో నియంత్రణ, నిర్మూలన అనే అంశంపై డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 94411 05405, 94409 72504.
కడప: 10 (ఆదివారం) సా. 4.30 గం.కు కడపలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల కందుల ఎస్టేట్‌లో సీబీఐటీ కాలేజీ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. మహిళలకు ప్రత్యేక ఆహ్వానం. వివరాలకు.. 96408 08099, 96660 71719.
తాడిపత్రి: 11 (సోమవారం) ఉ. 9.30 గంటలకు తాడిపత్రిలోని శ్రీ కృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ (శ్రీనివాసపురం, దివాకర్ పెట్రోల్ బంకు వెనుక)లో స్పర్శ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. 98490 98387, 96766 35193.
ప్రొద్దుటూరు : 11 (సోమవారం) సా. 4.30 గంటలకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్)లో సీబీఐటీ కాలేజీ ఆధ్వర్యంలో జరిగే సభలో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 96408 08099, 96660 71719.
పత్తి పంట ఉంటే, వెంటనే పీకెయ్యండి!
అవును. మీరు సరిగ్గానే చదివారు.. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పత్తి వేసిన రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(íపీజేటీఎస్‌ఏయూ) ద్వారా డిసెంబర్ నెలాఖరుకు పత్తి పంటను తీసివేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా ఇప్పటికీ, నీటి వసతి కింద పత్తిని వేసిన రైతులు పంటను కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆశించిన ఎర్ర గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగి రాబోయే ఖరీఫ్ పంటకాలంలో ఎక్కువ నష్టం కలిగించే ఆస్కారం ఉంది. కాబట్టి రైతాంగమంతా ఫిబ్రవరి మొదటి వారానికి తప్పనిసరిగా పత్తి పంటను తీసివేసి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పీజేటీఎస్‌ఏయూ విస్తరణ సంచాలకులు కోరారు. ఫిబ్రవరి నుంచి మే వరకు తెలంగాణలోని ఏ ప్రాంతంలోనూ పత్తి పంట లేకుండా చూసుకోవడం ద్వారా అంటే.. క్రాప్ హాలిడే ప్రకటించడం ద్వారా గులాబీ రంగు పురుగు రాబోయే ఖరీఫ్ పంటకు రాకుండా నివారించుకోవచ్చని సూచించారు.
10న సిరిధాన్యాల సాగు, మిక్సీతో మరపట్టడంపై శిక్షణ
ఈనెల 10 (ఆదివారం)న ఉ. 10 గం.– సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో సిరిధాన్యాలు మిక్సీతో మరపట్టించడం, సిరిధాన్యాల సాగు, అటవీ చైతన్య ద్రావణం తయారీపై కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ శిక్షణ ఇవ్వనున్నారు. అటవీ చైతన్య ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255.
23న కరీంనగర్‌లో ఎన్.సి.ఓ.ఎఫ్. సేంద్రియ రైతు సమ్మేళనం
కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయం కేంద్రం (ఎన్.సి.ఓ.ఎఫ్.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్ (కలెక్టరేట్ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. – సా. 5 గం. వరకు రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్ డీ కంపోజర్ టెక్నాలజీతో సేంద్రియ వ్యవసాయం చేసే పద్ధతులు, పీజేఎస్ ఇండియా సర్టిఫికేషన్, సేంద్రియ మార్కెట్ అనుసంధానంపై సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఎన్.సి.ఓ.ఎఫ్. డైరెక్టర్ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. వూట్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాలకు.. విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకులు సముద్రాల జనార్దన్‌రావు– 93969 69217, 84640 09350.
మార్చి 1–3 తేదీల్లో హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా
గోఆధారిత రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో మార్చి 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పారామం నైట్ బజార్‌లో సేంద్రియ ఉత్పత్తుల మేళా (ప్రదర్శన, అమ్మకాలు, అవగాహన సదస్సులు) జరగనుంది. 1న ఉ. 10 గంటలకు మహా రైతు సమ్మేళనం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంపై ఇష్టాగోష్టి ఉంటుంది. 2న మ. 3 గంటలకు సేంద్రియ వ్యవసాయంపై సదస్సు ఉంటుంది. 3న మ. 3 గంటలకు జరిగే సేంద్రియ వ్యవసాయం–ఆరోగ్య అవగాహన సదస్సులో స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను ఉచితంగా అమ్ముకోవడానికి అనుమతి ఉంటుందని గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. వివరాలకు.. 76598 55588, 91001 02229, 92465 33243, 98666 47534.
10, 11 తేదీల్లో కడప జిల్లాలో డా. ఖాదర్ వలి సభలు
Published Tue, Feb 5 2019 6:32 AM | Last Updated on Mon, Feb 11 2019 11:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment