30 నుంచి కోస్తా జిల్లాల్లో డా. ఖాదర్‌ ప్రసంగాలు | Dr. Khader Speeches on kostal districts on sept 30 | Sakshi
Sakshi News home page

30 నుంచి కోస్తా జిల్లాల్లో డా. ఖాదర్‌ ప్రసంగాలు

Published Tue, Sep 25 2018 7:11 AM | Last Updated on Tue, Sep 25 2018 7:11 AM

Dr. Khader Speeches on kostal districts on sept 30 - Sakshi

అటవీ వ్యవసాయ, సిరిధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలీ(మైసూర్‌) ఈనెల 30, అక్టోబర్‌ 1,2 తేదీల్లో కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగు, సిరిధాన్యాలు – కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం– అన్ని రకాల వ్యాధులను నిర్మూలించే దేశీ ఆహార పద్ధతులపై ఆయన ప్రసంగిస్తారు. 30న ఉ. 10 గం.కు గుంటూరు (బాలాజీ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, బృందావన్‌ గార్డెన్స్, 5వ లైను), అదే రోజు సా. 4 గం.కు విజయవాడ (సిద్ధార్థ ఆర్ట్స్‌–సైన్స్‌ కళాశాల, మొగల్రాజపురం), అక్టోబర్‌ 1 ఉ. 10. గం.కు రాజమండ్రి (గేదెల నూకరాజు కల్యాణ మండపం, మెయిన్‌ రోడ్, ఎ.సి.గార్డెన్స్, రాజమండ్రి), అదేరోజు సా. 4 గం.కు కాకినాడ (అల్యూమ్ని ఆడిటోరియం హాల్, జె.ఎన్‌.టి.యు, కాకినాడ)లో డా. ఖాదర్‌ ప్రసంగి స్తారు. 2 (మంగళవారం)న సా. 3 గం.కు విశాఖ పట్నం(సిరిపురం జంక్షన్, హెచ్‌.పి. పెట్రోల్‌ బంకు ఎదురుగా) ఏయూ కాన్వకేషన్‌ హాల్‌లో ప్రసంగి స్తారు.
అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 70939 73999.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement