శ్రుతిహాసన్
‘‘ముంబైలో స్వయంగా నా ఇంట్లోనే ఓ అగంతకుడు నాపై ఎటాక్ చేశాడు. ఆ క్షణంలో నేను కొంత భీతిల్లిన మాట నిజమే. కానీ.. నేను పిరికిదాన్ని కాను. అందుకే.. ప్రతిఘటించగలిగాను’’ అంటూ తనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు శ్రుతిహాసన్. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మహిళలపై సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలపై శ్రుతి స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘మనదేశంలో మహిళలకు నిజంగా రక్షణ తక్కువే. నాకు జరిగిన ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలామందికి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉంటే... ఆడకూతుళ్లపై జరుగుతున్న దారుణాలను తేలిగ్గా అరికట్టవచ్చు’’ అని ఆవేశంగా చెప్పారు.