భారత్‌లో పర్యటిస్తున్న డొనాల్డ్ ట్రంప్ జూనియర్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పేదరికంలో మగ్గే ప్రజలు సైతం సంతోషంగా నవ్వగలగడం తనను అబ్బురపరిచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ అన్నారు. ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ భారత్‌లో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అవుతారు. దేశంలోని పలు నగరాల్లో చేపట్టిన ట్రంప్ టవర్స్ ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతారు.
జూనియర్ ట్రంప్ భారత్ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనని, ప్రైవేట్ సిటిజన్‌గా పర్యటన కొనసాగిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి హెతర్ నౌర్ట్ చెప్పారు. ఎలాంటి అధికారిక హోదాలో ట్రంప్ పర్యటించడంలేదని స్పష్టం చేశారు. భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌కు జూనియర్ ట్రంప్ హాజరవనున్నారు. మరోవైపు దేశరాజధానిలోని ఓ స్టార్ హోటల్‌లో ట్రంప్ రియల్‌ఎస్టేట్ డెవలపర్లతో భేటీ అయ్యారు. కోల్‌కతా, ముంబయి, పూణే, గుర్‌గావ్ తదితర నగరాల్లోనూ భారత ఇన్వెస్టర్లు, బిజినెస్ లీడర్లతో ఆయన సమావేశమవుతారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment