Marping
-
అసభ్యకర ఫోటోలు.. యాంకర్ అనసూయని వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాంకర్ అనసూయని సోషల్ మీడియాలో వేదిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ కొంతకాలం క్రితం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నకిలీ అకౌంట్స్‌తో ప్రముఖ హీరోయిన్స్, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ల్యాప్‌టాప్‌లో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలు ఉన్నాయని, వీళ్లతో పాటు మరికొంతమందిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. -
గోరంట్ల మాధవ్ ఇష్యూ.. ఎవరినీ వదిలేది లేదు: మంత్రి తానేటి వనిత
సాక్షి, రాజమండ్రి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి వనిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వీడియో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాము. తప్పు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటాము. ఇది రాజకీయ కుట్రలా ఉందనే అనుమానాలు ఉన్నాయి. కుట్రకు పాల్పడితే ఎవరినీ వదలేది లేదు. టీడీపీ హయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయి. కొందరు పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య -
మహాత్ముడి ఫొటో మార్ఫింగ్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఫొటోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా గాంధీ ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారని, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని, ఆ సందర్భంగా అక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను మసక వెలుతురులో చూపించారని ఆరోపించింది. దీనిపై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. వెనుక వైపు గాంధీ చిత్రపటం ఉండగా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తున్నారని, అయితే కొందరు ఆకతాయిలు గాంధీ ఫొటోను మొగల్ చక్రవర్తిగా మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇది మహాత్మాగాంధీని అవమానించడమేనన్నారు. కాగా, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, తగు చర్యలు తీసుకుంటామని సైబర్ సెల్ ఎస్పీ శైలేంద్రసింగ్ చెప్పారు. -
ఫోటోలు తీసి ఫేస్'బుక్కయ్యాడు'
నిజామాబాద్ : ఓ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఇంటర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిక్కనూరు మండలం గుర్జకుంటకు చెందిన విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన సునీల్ రెడ్డి ఫోటోలు తీశాడు. వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిపై నిర్భయ, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హారజపరిచి రిమాండ్‌కు తరలించారు.