న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఫొటోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా గాంధీ ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారని, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని, ఆ సందర్భంగా అక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను మసక వెలుతురులో చూపించారని ఆరోపించింది.
దీనిపై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పార్టీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. వెనుక వైపు గాంధీ చిత్రపటం ఉండగా రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేస్తున్నారని, అయితే కొందరు ఆకతాయిలు గాంధీ ఫొటోను మొగల్ చక్రవర్తిగా మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇది మహాత్మాగాంధీని అవమానించడమేనన్నారు. కాగా, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, తగు చర్యలు తీసుకుంటామని సైబర్ సెల్ ఎస్పీ శైలేంద్రసింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment