సాక్షి, రాజమండ్రి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి వనిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వీడియో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాము. తప్పు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటాము. ఇది రాజకీయ కుట్రలా ఉందనే అనుమానాలు ఉన్నాయి. కుట్రకు పాల్పడితే ఎవరినీ వదలేది లేదు. టీడీపీ హయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయి. కొందరు పెయిడ్ ఆర్టిస్టులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment