ఓ వ్యక్తి అమెజాన్‌లో ఐఫోన్ 12 ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి సృహతప్పి పడిపోయాడు!! అందులో ఏముందంటే..
కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అనే వ్యక్తి రూ. 70,900ల ఖరీదైన ఐఫోన్ 12ను అమెజాన్‌లో అక్టోబర్ 12న ఆర్డర్ చేశాడు. అమెజాన్ పే కార్డ్‌తో బిల్ కూడా కట్టేశాడు. అక్టోబర్ 15న ఆర్డర్ ప్యాక్ వచ్చింది. ఉత్సాహంతో తెరిచాడు.. తీరా చూస్తే లోపల అంట్లు తోమే సోప్, 5 రూపాయల కాయిన్ ఉన్నాయట. దీంతో సదరు ఎన్నారై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!
ఐతే నూరుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్‌ను అప్పటికే జార్ఖండ్‌కి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ నుంచి వినియోగిస్తున్నాడనే విస్తుపోయే వాస్తవం బయటపడింది. దీంతో సైబర్ పోలీసులు అమెజాన్ అధికారులను సంప్రదించగా.. సెప్టెంబర్ 25 నుండి జార్ఖండ్‌లో ఈ ఫోన్ వాడుకలో ఉందని, నూరుల్ నుంచి అక్టోబర్‌లో ఆర్డర్ వచ్చింది కానీ అప్పటికే స్టాక్ అయిపోయిందని, అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని వెల్లడించారట.
తనకెదురైన ఈ వింత సంఘటనను నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయ్యింది. ఐఫోన్ బదులుగా ఆకుపచ్చ రంగు విమ్ డిష్ వాష్ సబ్బు, రూ .5 నాణెం కనిపించే ఒక చిత్రం కూడా సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులు ఇటుకలు, సబ్బులు.. ఆర్డర్ ప్యాకుల్లో రావడం మామూలైపోయింది. సో.. కస్టమర్లు ఆన్‌లైన్ పర్చేజింగ్‌తో కాస్త జాగ్రత్త మరి.
Comments
Please login to add a commentAdd a comment