న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రజలకు సుపరిచితుడైన డెక్లాన్ డొనెల్లీ టీవీ ప్రెజెంటర్, కమేడియన్, సింగర్, టీవీ ప్రొడ్యూసర్. ఇటీవల ఆయన తన టీవీ మిత్రుడైన ఆంటోని మాక్ పార్టిలిన్‌తో కలిసి ‘ఆంట్ అండ్ డెక్స్ డీఎన్‌ఏ జర్నీ’ పేరిట ఐటీవీ కోసం ఓ సీరియల్‌ను తీస్తున్నారు. అందులో భాగంగా వారిద్దరు ఇటీవల డీఎన్‌ఏ పరిశోధనల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ అనుకోకుండా డెక్లాన్‌కు కజిన్ మెగ్, ఆమె భర్త గ్రెక్ ఉన్నట్లు తెల్సింది.
వారు కూడా డెక్లాన్ లాగా అత్యధిక ధనవంతులే వారు ఓ విశాలమైన మైదానంలో నిర్మించిన ఓ పెద్ద భవనంలో నివసిస్తున్నారు. మెగ్, గ్రెక్ దంపతులకు సొంతంగా ఓ హెలికాప్టర్ కూడా ఉంది. డొనెల్లీ మిత్రులను గ్రెక్ తన హెలికాప్టర్‌లో తిప్పి తన మైదానాన్ని పరిసర ప్రాంతాలను చూపించారు. అంతే కాకుండా మెగ్ దంపతులు అమెరికాలోనే ఉంటున్న మరో 12 మంది డొనెల్లీ కజిన్స్‌ను రప్పించి ఓ రోజున డొనెల్లీకి పరిచయం చేశారు. అనూహ్యంగా అంతమంది కజిన్స్‌ను కలుసుకున్నందుకు డొనెల్లీ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వారిలో ఎక్కువ మంది ధనికులే అవడం మరో విశేషం. డొనెల్లీ తన అందమైన అనుభవం గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు.
అలా ఒకరికొకరు డీఎన్‌ఏ సంబంధాలను కనుక్కుంటూ పోగా, డొనెల్లీ నానమ్మ కిట్టీ జన్మతా ఐర్లాండ్ పౌరురాలట. 15వ ఏట ఇంగ్లాండ్‌కు వలసపోయి స్థిరపడ్డారట. ఇలా వంశవృక్షం మూలాలను వెతుక్కుంటూ పోతే ‘అలెక్స్ హాలి’ రాసినంత ‘రూట్స్’ పుస్తకం అవుతుందేమో! తనకు ఎదురైన అనుభవాన్ని డొనెల్లీ తన టీవీ సీరియల్ ఉపయోగించు కోవాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment