TV presenter
-
‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై ఫైర్
లండన్: బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాణి అంత్యక్రియల ఈవెంట్‌ను కవరేజ్ చేసే టైంలో ఆస్ట్రేలియాకు చెందిన చానెల్-9.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌ను గుర్తు పట్టలేకపోయింది. టీవీ ప్రజెంటర్స్ ట్రేసీ గ్రిమ్షా, పీటర్ ఓవర్టన్‌లు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆ సమయంలో.. తన భర్త హ్యూ ఓలీరేతో వెస్ట్మిన్స్టర్ అబేకు వచ్చారు లిజ్ ట్రస్. కారు నుంచి బయటకు వచ్చిన లిజ్ ట్రస్‌ను ఉద్దేశించి గ్రిమ్ షా..‘ఎవరామె?’ అంది. ‘గుర్తుపట్టడం కష్టంగా ఉంది. బహుశా మైనర్‌రాయల్స్(రాజకుటుంబంలో తక్కువ ప్రాధాన్యత ఉన్న సభ్యులు) కావొచ్చు. నాకు తెలియడం లేదు అని ఓవర్టన్ అన్నారు. ‘స్థానిక వేషధారణలోనే వస్తున్నారు కదా. బహుశా అక్కడి ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లేమో. దురదృష్టవశాత్తూ.. ప్రతీ ఒక్కరినీ మనం గుర్తించడం కష్టం’ అంటూ గ్రిమ్షా బదులిచ్చారు. అయితే.. I present, for your viewing pleasure, footage of Liz Truss getting out of a car, and Australian media being like, “Who the fuck is that?” Perfect.pic.twitter.com/dxNhdolvtK — Fancy Brenda 🏳️🌈🏳️⚧️ (they/them) (@SpillerOfTea) September 19, 2022 వెంటనే వాళ్లు తమ తప్పిదాన్ని తెలుసుకున్నట్లున్నారు. ఓవర్టన్ స్పందిస్తూ.. ఆ మిస్టరీ గెస్ట్ ఎవరో కాదు యూకే ప్రధాని లిజ్ ట్రస్ అంటూ చెప్పారు. అయితే అప్పటికే ఆ తప్పిదాన్ని పట్టేసిన కొందరు స్పందన మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా టీవీ హోస్ట్‌లు యూకే ప్రధానిని ‘మైనర్‌రాయల్స్’గా సంభోదించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు బ్రిటన్ ప్రజలు. ఆస్ట్రేలియా చానెల్‌కు ఆమాత్రం లిజ్ ట్రస్ తెలీదా అంటూ మండిపడుతున్నారు. బోరిస్ జాన్సన్ తదనంతరం.. బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్‌ను ఓడించి ఎన్నికయ్యారు లిజ్ ట్రస్. సెప్టెంబర్ 6వ తేదీన ఆమె బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టగా.. అనంతరం రెండు రోజులకే క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. ఇదీ చదవండి: యూకేలో ఆలయాలపై దాడులు... భారత్ ఖండన -
Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!
Afghanistan Crisis: కుక్కతోక వంకరేనని మరోమారు తాలిబన్లు రుజువు చేస్తున్నారు. దేశాన్ని అధీనం చేసుకున్న తొలి రోజుల్లో ఎంతో మారిపోయినట్లు ఫొజులిచ్చిన తాలిబన్ మూకలు క్రమంగా తమ పాత నిజ స్వరూపాలను బయటపెడుతున్నాయి. మహిళా హక్కులు కాపాడతామంటూ గంభీర ప్రకటనలిచ్చి రోజులు గడవకముందే మహిళలపై తీవ్ర అణిచివేత చూపుతున్నారు. దేశమంతా పలు ప్రాంతాల్లో స్త్రీలపై తాలిబన్ల అణిచివేత, అకృత్యాలపై వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తుపాకీ గురిపెట్టి మరీ తనను టీవీలో కనిపించవద్దంటూ తాలిబన్లు ఆదేశించారని ప్రముఖ మహిళా టీవీ ప్రజెంటర్ మెహ్ ముర్సల్ అమిరి వెల్లడించారు. అఫ్గాన్ నేషనల్ టీవీకి చెందిన ఆర్టీఏ స్టూడియోస్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఈ స్టూడియోను ఆక్రమించిన తాలిబన్లు ముర్సల్కు తుపాకీ గురిపెట్టి ‘‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’’ అని బెదిరించారు. మేకప్ వేసుకున్నందుకు, హిజాబ్ ధరించనందుకు ఆమెను తీవ్రంగా దూషించారు. తోటి యాంకర్లను సైతం ఆఫీసుకు రావద్దని హెచ్చరించారు. ఒకపక్క మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చి మారినట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు మరోపక్క మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంధకార భవితవ్యం... దేశంలో స్త్రీల భవిష్యత్ అంధకారంలోకి జారిందని ముర్సల్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత దిగజారుతాయని ఆందోళన చెందారు. లా డిగ్రీ చదువుతున్న ముర్సల్ టీవీలో వారానికి ఆరురోజుల పాటు సాగే 2 గంటల లైవ్‌షో నిర్వహిస్తారు. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటిలాగే ప్రోగ్రామ్ చేసేందుకు స్టూడియోకు వెళ్లానని, అనంతరం తాలిబన్లు స్టూడియో ను ఆక్రమించారని ముర్సల్ చెప్పారు. స్టేషన్లో ఉన్న మహిళలందరినీ వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. పురుష సిబ్బందిలో చాలామందిని కూడా తాలిబన్లు తొలగించారని ఆమె చెప్పారు. ‘‘టీవీ స్టూడియోను చూస్తుంటే ఏదో మసీదులో కొందరు పురుషులు కూర్చొని షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు మహిళలనే వారు ప్రపంచంలో ఉన్నట్లే అనిపించడంలేదు. నాకు భవిష్యత్‌పై, ఇప్పుడు జరుగుతున్న విషయం బయటకు చెప్పడంపై భయంగా ఉంది. అయితే ఏమీ చేయ కుండా కూర్చోలేను. ఇదే సమయంలో నా భద్రత కోసం జాగ్రత్తపడాలి’’ అని వ్యాఖ్యానించారు. హక్కులు కోల్పోయాం పౌర పాలనలో తాను హిజాబ్ ధరించడానికి వ్యతిరేకమని, కానీ ప్రస్తుతం తన హక్కును లాగేసుకున్నట్లు అనిపిస్తోందని ముర్సల్ చెప్పారు. షరియా చట్టం అమలైతే తాము స్వేచ్ఛగా సంచరించే వీలుండదని, ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే ముసుగుతో పాటు ఎవరో ఒక మగవారు తమవెంట ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికైనా పోదామంటే సరిహద్దులు మూసివేశారన్నారు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పాడడంలో తప్పులేదన్నది తన అభిప్రాయమన్నారు. తనకు సైతం ఇదే అనుభవం ఎదురైందని మరో జర్నలిస్టు ఖదీజా చెప్పారు. తాలిబన్లు నియమించిన డైరెక్టర్‌తో మాట్లాడితే కార్యక్రమాలన్నీ మార్చివేశామని, ఇకపై మహిళా జర్నలిస్టులు, యాంకర్లు అవసరం లేదని చెప్పారని ఖదీజా తెలిపారు. మహిళా రాజకీయవేత్త సలీమా మజారీని తాలిబన్లు బంధించి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈమె తాలిబన్లను తీవ్రంగా విమర్శించేవారు. భయంలో మహిళా క్రీడాకారులు తోటివారిని కాపాడమని ‘ఫిఫా’కు కెప్టెన్ విజ్ఞప్తి అఫ్గానిస్తాన్‌లో ఉన్న తన బృంద సభ్యులను రక్షించాలని ఆదేశ మహిళా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ షబ్నం మొబరెజ్ ఫిఫా(ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య)కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కానీ తన టీమ్ మెంబర్స్ అఫ్గాన్‌లోనే ఉన్నారని, వారి భవితవ్యంపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో ఉన్న తన సహచరురాలితో జరిపిన సంభాషణను ఆమె బయటపెట్టారు. వారి పరిస్థితి బాగాలేదని, వారంతా భయంలో ఉన్నారని, ఫిఫా వారిని కాపాడాలని కోరారు. ఫుట్‌బాల్ ఆడినందుకు వారి అడ్రసులు వెతుక్కుంటూ వెళ్లి తాలిబన్లు చంపేస్తారని ఆందోళనగా ఉందన్నారు. పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007లో అఫ్గాన్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ ఏర్పాటైంది. 2012లో ఖతార్‌పై గెలుపుతో ఈ టీమ్ తొలి విజయం నమోదు చేసింది. తాలిబన్ల పాలన వచ్చిన నేపథ్యంలో మహిళా క్రీడాకారులు తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయాలని, ఇంట్లో ఉన్న ప్రాక్టీస్ కిట్స్‌ను తగలబెట్టి జాగ్రత్త వహించాలని ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ఖలీదా పోపల్ సూచించడం మహిళా క్రీడాకారుల్లో భయానికి అద్దం పడుతోంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
డొనెల్లీకి ఓ ‘అందమైన అనుభవం’
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రజలకు సుపరిచితుడైన డెక్లాన్ డొనెల్లీ టీవీ ప్రెజెంటర్, కమేడియన్, సింగర్, టీవీ ప్రొడ్యూసర్. ఇటీవల ఆయన తన టీవీ మిత్రుడైన ఆంటోని మాక్ పార్టిలిన్తో కలిసి ‘ఆంట్ అండ్ డెక్స్ డీఎన్ఏ జర్నీ’ పేరిట ఐటీవీ కోసం ఓ సీరియల్‌ను తీస్తున్నారు. అందులో భాగంగా వారిద్దరు ఇటీవల డీఎన్ఏ పరిశోధనల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ అనుకోకుండా డెక్లాన్‌కు కజిన్ మెగ్, ఆమె భర్త గ్రెక్ ఉన్నట్లు తెల్సింది. వారు కూడా డెక్లాన్ లాగా అత్యధిక ధనవంతులే వారు ఓ విశాలమైన మైదానంలో నిర్మించిన ఓ పెద్ద భవనంలో నివసిస్తున్నారు. మెగ్, గ్రెక్ దంపతులకు సొంతంగా ఓ హెలికాప్టర్ కూడా ఉంది. డొనెల్లీ మిత్రులను గ్రెక్ తన హెలికాప్టర్లో తిప్పి తన మైదానాన్ని పరిసర ప్రాంతాలను చూపించారు. అంతే కాకుండా మెగ్ దంపతులు అమెరికాలోనే ఉంటున్న మరో 12 మంది డొనెల్లీ కజిన్స్‌ను రప్పించి ఓ రోజున డొనెల్లీకి పరిచయం చేశారు. అనూహ్యంగా అంతమంది కజిన్స్‌ను కలుసుకున్నందుకు డొనెల్లీ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వారిలో ఎక్కువ మంది ధనికులే అవడం మరో విశేషం. డొనెల్లీ తన అందమైన అనుభవం గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు. అలా ఒకరికొకరు డీఎన్ఏ సంబంధాలను కనుక్కుంటూ పోగా, డొనెల్లీ నానమ్మ కిట్టీ జన్మతా ఐర్లాండ్ పౌరురాలట. 15వ ఏట ఇంగ్లాండ్‌కు వలసపోయి స్థిరపడ్డారట. ఇలా వంశవృక్షం మూలాలను వెతుక్కుంటూ పోతే ‘అలెక్స్ హాలి’ రాసినంత ‘రూట్స్’ పుస్తకం అవుతుందేమో! తనకు ఎదురైన అనుభవాన్ని డొనెల్లీ తన టీవీ సీరియల్ ఉపయోగించు కోవాలనుకుంటున్నారు. -
అదే మొసలి.. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ
ఆస్ట్రేలియా: స్టీవ్ ఇర్విన్.. జంతు ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. స్టీవ్ ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షుడిగా, ప్రముఖ టీవీకారునిగా (టెలివిజన్) ప్రపంచానికి సుపరిచితుడు. కానీ, అతను స్టింగ్రే ప్రమాదంలో ప్రాణాలు కోల్పొయి విషాదం మిగిల్చాడు. స్టీవ్ మరణించే సమయంలో అతని కొడుకు రాబర్ట్ ఇర్విన్ వయసు కేవలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన రాబర్ట్ స్టీవ్.. బుధవారం తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. జంతు ప్రేమికులను ఈ పోస్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాబర్ట్ తన తండ్రి మాదిరిగానే జూ యూనిఫాం ధరించి, అతనిలాగానే మొసలికి ఆహారం విసిరిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పంచుకున్నాడు. ‘అప్పుడు నాన్నా, నేను ముర్రేకు ఆహారం ఇస్తున్నాం. ఇప్పుడు అదే స్థలం, అదే మొసలి. కానీ, రెండు ఫోటోల నడుమ 15 సంవత్సరాల దూరం’ అని ఫోటోకు శీర్షిక పెట్టాడు. రాబర్ట్ చేసిన పోస్ట్ తన తండ్రిని గుర్తు చేసిన కారణంగా వేలాది మంది ఉద్వేగానికి లోనయ్యారు. ‘నీ తండ్రి జీవించి ఉంటే ఎంత మురిసిపడేవారో..! రాబర్ట్’ అని ఆస్ట్రేలియా టీవీ ప్రజెంటర్ లిసా విల్కిన్సన్ పేర్కొనగా.. ‘నువ్వు అక్షరాల అతని అడుగుజాడల్లో నడవడం చూసి మీ నాన్న సంతోషించేవారు‘ అని నటి ఎమ్మీ పెర్రీ అన్నారు. కాగా, స్టీవ్ ఇర్విన్ ఇద్దరు పిల్లలు రాబర్ట్, బిందీ వన్యప్రాణి సంరక్షణకై సేవలందిస్తున్నారు. రాబర్ట్ వైల్డ్ లైఫ్ ప్రజెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ‘క్రైకీ ఇట్స్ ద ఇర్విన్’ రియాలిటీ షో- 2018లో ఇర్విన్ భర్యా, పిల్లలు పాల్గొన్నారు. View this post on Instagram Dad and me feeding Murray... same place, same croc - two photos 15 years apart ❤️🐊 A post shared by Robert Irwin (@robertirwinphotography) on Jul 3, 2019 at 4:20am PDT -
మరో వివాదంలో గేల్
ఆసీస్ మాజీలను తిట్టిపోసిన క్రికెటర్ మెల్బోర్న్: టీవీ వ్యాఖ్యాతపై శృంగారపరమైన వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన విండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో తన ప్రవర్తనను తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లపై గేల్ తిట్ల వర్షం కురిపించాడు. బీబీఎల్‌లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత ట్విట్టర్లో ఇయాన్ చాపెల్, పాంటింగ్, క్రిస్ రోజర్స్, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్లను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన పదజాలంతో ట్వీట్లు చేశాడు. ‘నేనంటే గిట్టని వారికి మరోసారి కృతజ్ఞతలు. మీరంతా తప్పు అని అంటున్న అంశంపై.... నా ముందు నవ్వుతూ కనిపించే ప్రస్తుత, మాజీ క్రికెటర్లు బహిరంగంగా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ దానికి కట్టుబడి ఉండే దమ్ము, ధైర్యం మీకు లేదు. నేను కనిపించినప్పుడు గేల్.. నీకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు అన్నారు. ఇక నుంచి నాకు ఏదీ చెప్పొద్దు. ఆస్ట్రేలియా అంటే నాకు చాలా ఇష్టం. మరోసారి ఇక్కడికి వస్తాను కూడా’ అంటూ ధ్వజమెత్తిన గేల్ కొన్ని అసభ్య పదాలను వాడి ట్వీట్స్ చేశాడు. -
ప్రాణం తీసిన డైటింగ్
నాజూగ్గా అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. సన్నబడాలనే కోరిక మంచిదే గాని...దాని కోసం చేసే ప్రయత్నాలే ప్రాణం మీదికి తెస్తున్నాయి. పీచెస్ గెడాఫ్... బ్రిటన్‌కి చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, పాత్రికేయురాలు. ఈ నెల ఏప్రిల్ 7వ తేదీన మరణించింది. కొందరు ఆత్మహత్య అనుకున్నారు. ఇంకొందరు హత్య అనుకున్నారు. పాతికేళ్ల గెడాఫ్ ఆకస్మిక మరణం అందరికీ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో పోస్టుమార్టం రిపోర్టు వివరాలు బయటికొచ్చాయి. కేవలం ఆమె పాటించిన ఆహారనియమాలే ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయని చెప్పగానే ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది. ఇది నిజమా! అంటూ చాలామంది వైద్యుల్ని సంప్రదించడం కూడా మొదలుపెట్టారు. ఇంతకీ గెడాఫ్ చేసిన పొరపాటేమిటంటే... రోజు మూడు గ్లాసుల పళ్లరసాలు తాగుతూ బతికేద్దామనుకోవడం. గత ఏడాది ఇదే సమయానికి గెడాఫ్ ఒక ట్వీట్ చేసింది. ‘నేను రోజురోజుకీ బరువు పెరుగుతున్నాను... వైద్యుల్ని సంప్రదిస్తే కారణం నేను ఇష్టంగా తినే ‘జంక్‌ఫుడ్’ అన్నారు. ఇక నుంచి నా ఆహారనియమాలను మార్చేసుకుంటున్నాను...’ అని చెప్పింది. కేవలం పళ్ల్లరసాలు...మధ్యలో చిప్స్వంటివి తింటూ గడిపేస్తున్న గెడాఫ్ చూస్తుండగానే బరువు తగ్గిపోయింది. ఇద్దరు పిల్లల తల్లయిన గెడాఫ్ రెండో అమ్మాయి పుట్టినపుడు బాగా బరువు పెరిగింది. బాలింతగా వున్న సమయంలో తల్లి బరువుగా ఉండడం సహజమని స్నేహితులు చెప్పినా వినిపించుకోకుండా కఠిన నియమాలకు సిద్ధ్దమైపోయింది గెడాఫ్. పూర్తిగా ఘనపదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఆమె శరీరంలో పోషకాలు పూర్తిగా లోపించాయి. దాంతో రక్తహీనత, ఐరన్ లోపం ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల గెడాఫ్ మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ‘గెడాఫ్ మరణం ఓ పాఠం’ అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజమే... ఆరోగ్యాన్ని నిర్ణయించేది బరువొక్కటే కాదు... మన అవయవాల పనితీరు కూడా. మన ఆరోగ్య పరిస్థితి కూడా. బరువు తగ్గాలనుకునేవారు తగినంత వ్యాయామం చేస్తూ...వైద్యుల పర్యవేక్షణలో బరువుతగ్గే ప్రయత్నాలు చేస్తే మంచిది. సొంతనిర్ణయాలు ప్రమాదం... బరువు తగ్గాలనుకోవడం ఆరోగ్యకరమైన విషయమే కానీ, అకస్మాత్తుగా తగ్గిపోవాలని కోరుకోవడం, సొంత నిర్ణయాలతో అద్భుతాలు సృష్టించాలనుకోవడం మాత్రం ప్రాణాలతో చెలగాటమాడడమే. ఒక్క గెడాఫ్ విషయమనే కాదు....అలాంటివాళ్లు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవాలనుకోవడం కూడా ఒక మానసిక జబ్బే. పళ్ల రసాలు, అల్పాహారాలు తిని కూడా బతకొచ్చు. అవి కేవలం తాత్కాలిక శక్తిని ఇస్తాయి. దీర్ఘకాలంలో వచ్చే దుష్పలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తగినంత ఘనపదార్థం లేకపోతే కొంతకాలం తర్వాత మన శరీరంలోని అవయవాల పనితీరులో మార్పు వచ్చేస్తుంది. రక్తహీనత, నీటిశాతం తగ్గిపోవడం, ఆక్సిజన్ లోపం, ఐరన్ లోపం... మొదలవుతాయి. ఒక్కసారి అవయవాల పనితీరులో మార్పు వచ్చిందంటే మళ్లీ వాటిని బాగుచేసుకోవడం చాలా కష్టం. కాబట్టి...మీరు బరువు తగ్గాలనుకుంటే వైద్యుల్ని సంప్రదించండి. మీ వయసు, శరీరతత్వం... వంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆహారనియమాలను సూచిస్తారు. దానికి తగ్గట్టుగా బరువుతగ్గే ప్రయత్నాలు వికటించే అవకాశం ఉండదు. - సుజాత, చీఫ్ న్యూట్రిషనిస్ట్, కేర్ ఆసుపత్రి, హైదరాబాద్.