ఆకట్టుకుంటున్న‘అహం బ్రహ్మస్మి’ ట్రైలర్‌ | Aham Brahmasmi Web Series Trailer Launched By Sunil Narang | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న‘అహం బ్రహ్మస్మి’ ట్రైలర్‌

Published Sat, Jul 17 2021 7:00 PM | Last Updated on Sat, Jul 17 2021 7:44 PM

Aham Brahmasmi Web Series Trailer Launched By Sunil Narang - Sakshi

రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతగంటి, చాందినీరావు, సాయి కేతన్ రావు, కృష్ణతేజ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘అహం బ్రహ్మస్మి’. 11భాగాలుగా రాబోతోన్న ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందింది. లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సిరీస్ కు సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వం వహిస్తున్నారు. 

అహం బ్రహ్మస్మి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన వై రవికుమార్ గారు చేతుల మీదుగా విడుదలైంది. ఇక ట్రైలర్ ను సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా  సిరీస్‌ యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ..‘సింపుల్ గా చెబితే ఇదో వెబ్ గేమింగ్ నేపథ్యంలో రూపొందిన సిరీస్. ఆడిన ప్రతి ఒక్కరూ ఆ గేమ్ లో విన్ అవ్వాలి. గెలిచిన వారికి భారీ అమౌంట్ వస్తుంది. ఒక వేళ లాస్ అయితే వారికి బాగా నచ్చినవారి ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. మరి ఇంత డేంజరస్ గా ఉన్న ఈ గేమ్ ను ఆపేందుకు లోకల్ డిటెక్టివ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలూ ఏంటనేది అనూహ్యమైన మలుపులతో.. ఆద్యంతం అద్భుతమనిపించే స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన సిరీసే ఈ అహం బ్రహ్మస్మి’ అని అన్నారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 18నుంచి అమెజాన్ ప్రైమ్(యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్(యూ. కే), ఎమ్.ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్, విఐ వంటి పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement