మాలీవుడ్‌, బాలీవుడ్‌లో సినిమాలు నిర్మిస్తున్న రానా | Rana Daggubati to produce a Bollywood Film | Sakshi
Sakshi News home page

తెలుగులో హీరోగా.. మాలీవుడ్‌, బాలీవుడ్‌లో నిర్మాతగా పని చేస్తున్న రానా

Published Tue, Jun 6 2023 3:46 AM | Last Updated on Tue, Jun 6 2023 8:49 AM

Rana Daggubati to produce a Bollywood Film - Sakshi

టాలీవుడ్‌ హీరో రానా, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్‌ ధావన్‌ హీరోలుగా నటించడం లేదట. వరుణ్‌ ధావన్‌ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్‌ నారంగ్‌ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్‌ టైటిల్‌) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement