ranaa
-
మాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న రానా
టాలీవుడ్ హీరో రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించడం లేదట. వరుణ్ ధావన్ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
నేనే రాజు నేనే మంత్రి కాంబినేషన్ రిపీట్
‘‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రం తర్వాత హీరో రానా, దర్శకుడు తేజ మరో సినిమా చేయనున్నారు. గోపీనాథ్ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఓ మలయాళ నటుడు కీలక పాత్ర పోషిస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... రానా హీరోగా తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే మూవీ రానున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. మరి... ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రకటించిన తాజా చిత్రం ఇదేనా? లేక వేరే సినిమానా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
సినీతారలకు చేదు అనుభవం
-
సీనీతారలకు చేదు అనుభవం
-
అభిమానుల అత్యుత్సాహం.. వెనుదిరిగిన సినీతారలు
కేపీహెచ్బీకాలనీ (హైదరాబాద్): చెన్నై వరద బాధితులకు అండగా విరాళాలను సేకరించేందుకు ఆదివారం కూకట్పల్లి సుజనా ఫోరం మాల్లో ఏర్పాటు చేసిన సినీతారల కార్యక్రమం రసాభాసగా మారింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో ఫోరం మాల్ కిక్కిరిసిపోయి తొక్కిసలాటకు దారితీసింది. సీనీతారలు కాజల్, రానా, అల్లరి నరేష్, నిఖిల్, మంచు లక్ష్మి, తేజశ్వి తదితరులకు చేదు అనుభవం ఎదురైంది. సభా వేదిక వద్దకు వచ్చిన హీరో, హీరోయిన్లను తాకేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ముందుకు చొచ్చుకురావడం, సెల్ఫోన్లతో చిత్రీకరించేందుకు పోటీపడటంతో పరిస్థితి ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పలువురు అభిమానులు కిందపడిపోయారు. కార్యక్రమ నిర్వాహాకులు, పోలీసులు, బౌన్సర్లు అభిమానులను కట్టడి చేసేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సినీతారలు పక్కనే ఉన్న స్టార్బక్స్ లోకి వెళ్లి కొద్దిసేపు సేదతీరారు. అనంతరం అక్కడి నుంచి నిష్ర్కమించారు. కాగా, చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని సినీ తారలు కాజల్, అల్లరి నరేష్, రానా, మంచులక్ష్మి, తేజస్విలు కోరారు. తమిళనాడులో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తి చెన్నై నగరం నీటమునిగిందని, అక్కడి ప్రజలలో తెలుగువారు కూడా ఉన్నారని, ప్రజలను ఆదుకునేందుకు మనమంతా సహకారం అందించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.