![Huge OTT Offers To Love Story Movie, See Producer Sunil Narang Reaction - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/9/sai-pallavi.gif.webp?itok=r4q9gmP3)
Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్‌స్టోరీ’ ఒకటి. ఫిదా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రాబోతుందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ స్పందించారు. ఈ సినిమాకు ఏకంగా 10 ఓటీటీ ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఐతే తమ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏ ఓటీటీకీ సినిమాను ఇవ్వలేదని ఆయన చెప్పారు. బిగ్ స్క్రీన్లలోనే ఈ సినిమా చూస్తారని నారంగ్ వ్యాఖ్యానించారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. జూలై 30న ‘లవ్‌స్టోరీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment