గుండెల్ని పిండేస్తున్న ‘లవ్‌స్టోరీ’ మెలోడీ | Naga Chaitanya Love Story Movie: Nee Chitram Choosi Lyrical Song Out | Sakshi

గుండెల్ని పిండేస్తున్న మెలోడి

Feb 14 2021 2:58 PM | Updated on Feb 14 2021 3:40 PM

Naga Chaitanya Love Story Movie: Nee Chitram Choosi Lyrical Song Out - Sakshi

యంగ్‌ హీరో నాగచైనత‍్య, నాచ్యురల్‌ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఒక పాట, టీజర్‌ మంచి ఆదరణ అభించింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ చిత్రంచూసి’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదలైన ఈ మెలోడి సాంగ్‌ గుండెల్ని పిండేస్తుంది. ఈ అద్భుతమైన పాటకు మిట్టపల్లి సురేందర్‌ లిరిక్స్‌ అందించగా, ప్రముఖ గాయకుడు కులకర్ణి ఆలపించారు. పవన్‌ సీహెచ్‌సంగీతం అందించారు. ఏప్రిల్‌ 16న చైతూ, సాయి పల్లవిల ‘లవ్‌స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement