![Love Story Movie: Saranga Dariya Song Out - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/28/music.jpg.webp?itok=Mel5ZRj6)
నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్య తరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ‘లవ్ స్టోరి’ నుంచి మూడో పాటను స్టార్ హీరోయిన్ సమంత ఆదివారం విడుదల చేసింది. ‘ఈ సీజన్‌లో డాన్స్ సాంగ్‌ను విడుదల చేస్తున్నాను. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్ చేశావు’ అంటూ సాయిపల్లవిని పొగుడుతూ సమంత ఈ పాటను విడుదల చేసింది.
‘సారంగ దరియా’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌కు నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి అదిరిపోయే స్టెప్పులేసింది. ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’ మాదిరి ఈ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ఈ పాట ఎంత బాగుందో.. సాయి పల్లవి ఫెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది. తెలంగాణ ఫోక్ జానపదం మాదిరి సాగే ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా, మంగ్లీ ఆలపించింది. పవన్ సీహెచ్‌సంగీతం అందించారు. ఏప్రిల్ 16న చైతూ, సాయి పల్లవిల ‘లవ్‌స్టోరి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
![1](https://www.sakshi.com/gallery_images/2021/02/28/01.jpg)
![2](https://www.sakshi.com/gallery_images/2021/02/28/02.jpg)
![3](https://www.sakshi.com/gallery_images/2021/02/28/025.jpg)
![4](https://www.sakshi.com/gallery_images/2021/02/28/25.jpg)
![5](https://www.sakshi.com/gallery_images/2021/02/28/63.jpg)
![6](https://www.sakshi.com/gallery_images/2021/02/28/65.jpg)
Comments
Please login to add a commentAdd a comment